ప్లీజ్ సర్.. నన్ను అరెస్ట్ చేయండి.. ఈ మనుషుల మధ్య కన్నా జైళ్లోనే బెటర్.. యూకేలో ఓ యువకుడి విచిత్ర స్టోరీ..

కరోనా వల్ల నాలుగు గోడల మధ్య ఉండి విసిగిపోయిన ఓ యువకుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ప్లీజ్‌ సార్ నన్న అరెస్ట్ చేయండంటూ మొరపెట్టుకున్నాడు.

ప్లీజ్ సర్.. నన్ను అరెస్ట్ చేయండి.. ఈ మనుషుల మధ్య కన్నా జైళ్లోనే బెటర్.. యూకేలో ఓ యువకుడి విచిత్ర స్టోరీ..
Follow us

|

Updated on: Feb 20, 2021 | 7:32 AM

కరోనా వల్ల నాలుగు గోడల మధ్య ఉండి విసిగిపోయిన ఓ యువకుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ప్లీజ్‌ సార్ నన్న అరెస్ట్ చేయండంటూ మొరపెట్టుకున్నాడు. కరోనా వల్ల అన్ని దేశాలు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ సమయాన్ని కొందరు సద్వినియోగం చేసుకొంటే, మరికొందరు ఖాళీగా ఉంటూ గడిపేశారు. ఎప్పుడూ ఉరుకులు పరుగులతో జీవించే చాలా మంది ఇళ్లలో ఉండలేకపోయారు.యూకేలో ఓ యువకుడు కూడా ఇలాంటి బాధనే ఎదర్కొని తట్టుకోలేక జైలుకు వెళుదామని నిర్ణయించుకున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరారీలో ఉన్న ఓ వ్యక్తి లాక్‌డౌన్‌ సమయంలో నాలుగు గోడల మధ్య ఎక్కువ సమయం ఉండటంతో పాటు, తాను ప్రస్తుతం జీవిస్తున్న మనుషులతో ఉండటం కంటే జైల్లోనే ప్రశాంతంగా ఉంటుందని భావించి యూకేలోని ససెక్స్‌ పోలీసులకు లొంగిపోయాడు. తనను జైల్లోనే ఉంచాలని కోరుతూ ఆ వ్యక్తి బుధవారం బర్గస్‌హిల్‌ పోలీసుస్టేషన్‌లో లొంగిపోయినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని డారెన్‌ టేలర్‌ అనే పోలీసు అధికారి ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో వెలుగులోకి వచ్చింది. అతడు లొంగిపోయిన అనంతరం జైలుకు తరలించినట్లు ఆయన తెలిపారు.

షాకింగ్.. గత సంవత్సరంలో చనిపోయిన మహిళ.. మూడు నెలల తర్వాత బ్రతికొచ్చింది.. పూర్తి వివరాలు..