షాకింగ్.. గత సంవత్సరంలో చనిపోయిన మహిళ.. మూడు నెలల తర్వాత బ్రతికొచ్చింది.. పూర్తి వివరాలు..

చనిపోయింది అనుకున్న మహిళ తిరిగొచ్చి అందిరికి షాక్ గురి చేసింది. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో జరిగింది. 2019 మే నెలలో శరణ్ జిల్లాకు చెందిన స్వీటీ కుమారీ అనే మహిళ తన ఏడేళ్ళ కుమారుడు

షాకింగ్.. గత సంవత్సరంలో చనిపోయిన మహిళ.. మూడు నెలల తర్వాత బ్రతికొచ్చింది.. పూర్తి వివరాలు..
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 26, 2020 | 5:41 PM

చనిపోయింది అనుకున్న మహిళ తిరిగొచ్చి అందిరికి షాక్ గురి చేసింది. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో జరిగింది. 2019 మే నెలలో శరణ్ జిల్లాకు చెందిన స్వీటీ కుమారీ అనే మహిళ తన ఏడేళ్ళ కుమారుడు పవన్‏తో కనిపించకుండా పోయింది. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆ తర్వాత రెండు రోజులకు దగ్గర్లోని నది సమీపంలో ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహాన్ని స్వీటీకుమారీ తండ్రికి చూపించారు. ఆ మృతదేహాన్ని చూసిన స్వీటీ తండ్రి అది తమ కూతురిదేనని చెప్పాడు. దీంతో మిస్సింగ్ కేసు కాస్తా హత్య కేసుగా మారింది. దీంతో స్వీటీ తండ్రి ఆమె అత్తింటివారిపై కేసు పెట్టాడు. మూడు నెలల పాటు విచారణ చేసిన పోలీసులు స్వీటీ మరుదులు, వదిన ఈ హత్య చేశారని తేల్చారు.

హత్య చేసినట్లుగా వారు అంగీకరించడంతో వారిని కోర్టులో ప్రవేశ పెట్టి అనంతరం జైలుకు తరలించారు. అయితే కొద్దిరోజుల తర్వాత చనిపోయిందనుకున్న స్వీటీ ముజఫర్ పూర్‏లో ప్రాణాలతో కనపడింది. దీంతో ఆమెను శరణ్‏కు తరలించారు పోలీసులు. స్వీటీ హత్యకు సంబంధించిన కేసును తిరిగి ప్రారంభించారు. ముజర్ ఫూర్‏కు చేరడానికి ముందు ఆమె ఓ వ్యక్తితో కలిసి ముంబై పారిపోయినట్లుగా తేలింది. ఇంకా కొన్ని రోజుల్లో ఆమెను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. స్వీటీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న ఆమె కుటుంబ సభ్యులపై కేసులు తొలగించి బయటకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.