క్షణికావేశంలో ఇద్దరు యువకుల ఆత్మహత్య.. బైక్ కొనివ్వలేదని ఒకరు, మానసికస్థితి సరిగలేక మరొకరు..!
హైదరాబాద్ మహానగరంలో విషాద ఘటనలు చోటు చేసుకుంది. తల్లిదండ్రులు తనకు బైక్ కొనివ్వలేదని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో ఘటనలో మానసికస్థితి సరిగాలేని మరో యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హైదరాబాద్ మహానగరంలో విషాద ఘటనలు చోటు చేసుకుంది. తల్లిదండ్రులు తనకు బైక్ కొనివ్వలేదని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో ఘటనలో మానసికస్థితి సరిగాలేని మరో యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు నవ యువకులు ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటనలకు సంబంధించి పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల కథనం ప్రకారం.. నగర శివారులోని జీడిమెట్ల ప్రాంతంలోని రాజీవ్‌గాంధీనగర్‌లో నివాసముండే చక్రాల కృష్ణ కుమారుడు ప్రవీణ్‌కుమార్(24) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 24న రాత్రి 8గంటలకు కుటుంబ సభ్యులు పని నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి రాత్రి 9గంటలకు వచ్చే సరికి ప్రవీణ్ కుమార్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు అతడి తండ్రి తెలిపారు. రెండు రోజుల క్రితం బైక్ ఇప్పించమని అడగగా, లాక్‌డౌన్ కారణంగా అప్పులు ఉన్నాయని సముదాయించామని ఇంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. చెట్టంత కొడుకు మృతి చెందడాన్ని తట్టుకోలేని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటన బాలానగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. రాజుకాలనీకి చెందిన డింగ్రే చంద్రకాంత్, డింగ్రే శ్రీకాంత్ ఇద్దరు అన్నదమ్ములు. చంద్రకాంత్ ఓ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేస్తుంటే శ్రీకాంత్(28) బాలానగర్‌లోని ఓ మెటల్‌షాపులో పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం చంద్రకాంత్ శ్రీకాంత్‌కు చెప్పి డ్యూటీకి వెళ్లాడు. మధ్యాహ్నం ఎన్నిసార్లు ఫోన్ చేసినా శ్రీకాంత్ లిఫ్టు చేయకపోవడంతో చంద్రకాంత్ పొరుగింటి వారిని ఇంటికి పంపాడు. అప్పటికే శ్రీకాంత్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాంత్‌కు కోపం, ఆవేశం ఎక్కువని, అతని మానసికస్థితి బాలేదని అందుకే ఉరేసుకుని ఉండవచ్చని చంద్రకాంత్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.