అబద్ధం చెప్పి అడ్డంగా బుక్కయిన మహిళా ఐపీఎస్ అధికారి.. అసలు ఈ పని ఎందుకు చేసిందంటే..

కర్ణాటకలోని బెంగుళూరులో ఓ మహిళా ఐపీఎస్ అధికారి కాన్ఫిడెన్షియల్ సమాచారం కోసం సరికొత్త రీతిలో వ్యవహరించింది. కానీ అనుకోని రీతిలో

  • uppula Raju
  • Publish Date - 5:57 pm, Sat, 26 December 20
అబద్ధం చెప్పి అడ్డంగా బుక్కయిన మహిళా ఐపీఎస్ అధికారి.. అసలు ఈ పని ఎందుకు చేసిందంటే..

కర్ణాటకలోని బెంగుళూరులో ఓ మహిళా ఐపీఎస్ అధికారి కాన్ఫిడెన్షియల్ సమాచారం కోసం సరికొత్త రీతిలో వ్యవహరించింది. కానీ అనుకోని రీతిలో కేసులో బుక్కయింది. కొన్ని విషయాల కోసం కొంతమంది పోలీసులు మారు వేషాలు వేసుకొని వివరాల సేకరణ చేస్తారు అయితే వారి హద్దులు దాటితే మాత్రం ఇలాగే ఉంటుంది. తాను హోం సెక్రటరీ అని చెప్పుకొని ఓ ప్రాజెక్ట్ వివరాలు తెలుసుకోవాలని భావించి అధికారులకు అడ్డంగా దొరికిపోయింది ఈ అధికారి.

కర్ణాటకలో ఓ మహిళా ఐపీఎస్ అధికారి మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన పథకం సేఫ్ సిటీ ప్రాజెక్ట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం రూ.619 కోట్లతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. టెండరింగ్ ప్రక్రియలో భాగంగా రిక్వస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ) తయారు చేసేందుకు పోలీస్ శాఖ ఓ కన్సల్టెన్సీ కంపెనీని నియమించింది. కాగా సదరు మహిళా ఐపీఎస్ తాను హోం సెక్రెటరీ అని చెప్పుకుంటూ కన్సల్టెన్సీ నుంచి టెండరింగ్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేశారని పోలీసుల దృష్టికి వచ్చింది. గతంలో క్యాన్సిలైన ఆర్‌ఎఫ్‌పీకి సంబంధించిన వివరాలను కోరారని పోలీసులు తెలుసుకున్నారు. దీంతో వారు రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ టీఎమ్ విజయ్ భాస్కర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని కన్సల్టెన్సీ అధికారులు కోరారు. కాగా ఆమె ఎందుకు ఈ పనిచేసిందో మాత్రం వివరాలు తెలియాల్సి ఉంది.