శాసన సభ ఆమోదించిన బిల్లులను తొక్కి పెడతారా ? గవర్నర్ తీరుపై రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మండిపాటు, ఇదేం పద్థతి అని విమర్శ

రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ శాసనసభలో తాము ఆమోదించిన బిల్లులను గవర్నర్ రాష్ట్రపతికి పంపకుండా తొక్కిపెట్టడంపై రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు. వీటిని రాష్ట్రపతికి పంపకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని..

శాసన సభ ఆమోదించిన బిల్లులను తొక్కి పెడతారా ? గవర్నర్ తీరుపై రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మండిపాటు, ఇదేం పద్థతి అని విమర్శ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 26, 2020 | 5:20 PM

రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ శాసనసభలో తాము ఆమోదించిన బిల్లులను గవర్నర్ రాష్ట్రపతికి పంపకుండా తొక్కిపెట్టడంపై రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు. వీటిని రాష్ట్రపతికి పంపకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని గెహ్లాట్ ప్రశ్నించారు. పంజాబ్, ఛత్తీస్ గఢ్ గవర్నర్లు కూడా తమ రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతికి పంపని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్రం తెచ్చిన రైతు చట్టాలలోని అంశాలపై తమ అభిప్రాయాలను తెలిపేందుకు ఈ రాష్ట్రాల సీఎంలు, పుదుచ్ఛేరి సీఎం సైతం రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోరగాఅది లభించలేదన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు చాలావరకు తగ్గినప్పటికీ ఎన్డీయే ప్రభుత్వం ఈ తగ్గుదల సౌకర్యాన్ని రైతులకు కలిగించలేదని ఆయన ఆరోపించారు. పైగా చమురు ధరలు పెరుగుతుండగా కేంద్రం దీనిపై ఎక్సయిజు సుంకాన్ని పెంచడమేమిటని గెహ్లాట్ అన్నారు.

మరోవైపు.. కేరళలో కూడా రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఓ తీర్మానాన్ని ఆమోదించేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని ఆ రాష్ట్ర కేబినెట్ గవర్నర్ ని కోరినప్పటికీ ఆయన అందుకు అంగీకరించలేదు. బీజేపీయేతర రాష్ట్రాల పట్ల గవర్నర్లు ఇలా వ్యవహరించడాన్ని విపక్ష నేతలు తప్పుపడుతున్నారు.