ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. ఇవాళ కొత్తగా 282 మందికి కోవిడ్ పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. శనివారం కరోనా వైరస్ కేసులు అత్యల్ప స్థాయిలో నమోదయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. ఇవాళ కొత్తగా 282 మందికి కోవిడ్ పాజిటివ్
Follow us

|

Updated on: Dec 26, 2020 | 5:15 PM

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. శనివారం కరోనా వైరస్ కేసులు అత్యల్ప స్థాయిలో నమోదయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. అలాగే కరోనా మరణాలు సైతం పడిపోయాయి. గడిచిన 24 గంట వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 42,911 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, కేవలం 282 మందికి మాత్రమే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 8,80,712కి చేరుకుంది.అలాగే, కరోనా మరణాలు కూడా తగ్గిపోయింది. శనివారం కరోనా మహమ్మారి బారినపడి ఒక్కరు ప్రాణాలను కోల్పోయారు. కడప జిల్లాకు చెందిన ఒకరు కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ మహమ్మారి బారినపడి రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,092 మంది మృత్యువాతపడ్డారని అధికారులు తెలిపారు.

ఇక, శనివారం అత్యధికంగా గుంటూరు జిల్లాలో 86 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రకాశం జిల్లాలో అత్యల్పంగా ఒక్క కేసు నమోదైంది. అటు, రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య స్వల్పంగా పెరిగింది. శనివారం 442 మంది కోవిడ్‌ 19 బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,69,920 మంది కరోనా మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కాగా, ప్రస్తుతం ఏపీలో 3,700 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇదిలావుంటే, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,15,74,117 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..