రష్యాలో కొనసాగుతున్న కరోనా తీవ్రత.. 30 లక్షల మార్క్ దాటిన కోవిడ్ పాజిటివ్ కేసులు

ఏడాది కాలంగా కరోనా మహమ్మరి తన విశ్వరూపాన్ని చూపిస్తూనే ఉంది. రోజు రోజుకీ పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ప్రపంచం తల్లడిల్లుతోంది. ముఖ్యమంగా ర‌ష్యాలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ ఏమాత్రం తగ్గడంలేదు. రోజుకు 25 వేల‌కుపైగా కొత్త కేసులు న‌మోదవుతున్నాయి.

రష్యాలో కొనసాగుతున్న కరోనా తీవ్రత.. 30 లక్షల మార్క్ దాటిన కోవిడ్ పాజిటివ్ కేసులు
Follow us

|

Updated on: Dec 26, 2020 | 5:58 PM

ఏడాది కాలంగా కరోనా మహమ్మరి తన విశ్వరూపాన్ని చూపిస్తూనే ఉంది. రోజు రోజుకీ పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ప్రపంచం తల్లడిల్లుతోంది. ముఖ్యమంగా ర‌ష్యాలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ ఏమాత్రం తగ్గడంలేదు. రోజుకు 25 వేల‌కుపైగా కొత్త కేసులు న‌మోదవుతున్నాయి. ఇవాళ కూడా కొత్తగా 29,258 మందికి క‌రోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు ఆదేశ హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. దీంతో ర‌ష్యాలో ఇప్పటివ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30 ల‌క్షల మార్కును దాటి 30,21,964కు చేరుకుంది. కొత్తగా న‌మోదైన మొత్తం కేసుల‌లో రాజ‌ధాని మాస్కోలోనే 7,480 మందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు.

ఇక, క‌రోనా మ‌ర‌ణాలు కూడా ర‌ష్యాలో భారీగానే నమోదవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్యవధిలో 567 మంది క‌రోనా మహమ్మారి బారినపడి ప్రాణాలను కోల్పోయారు. దీంతో ఆ దేశవ్యాప్తంగా మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 54,226కు చేరింది. మరోవైపు, గ‌త 24 గంట‌ల్లో 28,185 మంది వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి కావ‌డంతో మొత్తం రిక‌వ‌రీల సంఖ్య 24,26,439కి పెరిగింది. కాగా, బ్రిటన్ కేంద్రంగా ప్రబలుతున్న కొత్త వైరస్ కారణంగా రష్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు త్వరలో కరోనా నుంచి విముక్తి కలిగించేందుకు స్పుత్నిక్-వి వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్లు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.

ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?