AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ్యాక్సిన్ పంపిణీపై రష్యా సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై 60ఏళ్లు పైబడిన వారికీ స్పుత్నిక్‌ టీకా

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తుగా 60ఏళ్లు పైబడిన వారికీ ఇకపై స్పుత్నిక్‌ టీకాను అందించేందుకు రష్యా అనుమతించింది.

వ్యాక్సిన్ పంపిణీపై రష్యా సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై 60ఏళ్లు పైబడిన వారికీ స్పుత్నిక్‌ టీకా
Balaraju Goud
|

Updated on: Dec 26, 2020 | 8:35 PM

Share

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తుగా 60ఏళ్లు పైబడిన వారికీ ఇకపై స్పుత్నిక్‌ టీకాను అందించేందుకు రష్యా అనుమతించింది. రష్యాలో అత్యవసర వినియోగం కింద స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ను అక్కడి ఔషధ నియంత్రణ సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపు రెండు లక్షలమందికి పైగా టీకాను పంపిణీ చేశారు. అయితే, అందులో 60ఏళ్లు పైబడిన వారికి టీకాను అవసరంలేదని తెలిపింది.

రష్యా వ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం జరుగుతుండటంతో దేశంలోని అన్ని ప్రాంతాలకు ఇప్పటికే టీకాలను పంపిణీ జరుగుతుంది. అయితే, తాజాగా రష్యా ప్రభుత్వం వయసు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ వేసేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు వయసు పైబడినవారిపై ఈ టీకాను విడిగా పరీక్షించారు నిపుణులు. ఈ ప్రయోగ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు నమోదు చేయడంతో రష్యా ఆరోగ్య శాఖ మంత్రి టీకాను అందరికీ అనుమతిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. కాగా, స్పుత్నిక్‌-వి టీకా ఎగుమతికి సంబంధించి రష్యా ఇప్పటికే చాలా దేశాలతో ఒప్పందాలు చేసుకుంది. ఇందులో భాగంగా రష్యా ప్రభుత్వం 3 లక్షల స్పుత్నిక్‌ టీకాలను అర్జెంటీనాకు అందించింది. అలాగే బెరారస్‌తో పాటు మరికొన్ని దేశాలకు కూడా వ్యాక్సిన్ అందించేందుకు రష్యా సిద్ధమవుతోంది.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత