Ril: ఐఎమ్‌జీ ఆర్ లో 50 శాతం వాటా కొనుగోలు చేయనున్న రిలయన్స్… డీల్ విలువ ఎంతో తెలుసా..?
ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మార్కెటింగ్, మేనేజ్‌మెంట్ కంపెనీ అయిన ఐఎమ్‌జీ వరల్డ్‌వైడ్ కంపెనీతో కలిసి రిలయన్స్ ఒక జాయింట్ వెంచర్‌ను 2010లో ఏర్పాటు చేసింది. ఐఎమ్‌జీ–రిలయన్స్ లిమిటెడ్(ఐఎమ్‌జీ–ఆర్) పేరుతో సమాన భాగస్వామ్యాలతో ఈ జేవీ ఏర్పాటైంది.

ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మార్కెటింగ్, మేనేజ్‌మెంట్ కంపెనీ అయిన ఐఎమ్‌జీ వరల్డ్‌వైడ్ కంపెనీతో కలిసి రిలయన్స్ ఒక జాయింట్ వెంచర్‌ను 2010లో ఏర్పాటు చేసింది. ఐఎమ్‌జీ–రిలయన్స్ లిమిటెడ్(ఐఎమ్‌జీ–ఆర్) పేరుతో సమాన భాగస్వామ్యాలతో ఈ జేవీ ఏర్పాటైంది. భారత్‌లో స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, ఫ్యాషన్ ఈవెంట్స్‌ల అభివృద్ధి. మార్కెటింగ్, నిర్వహణ కోసం ఈ జేవీని ప్రారంభించారు. అయితే ప్రస్తుతం ఐఎమ్‌జీ–రిలయన్స్ లిమిటెడ్(ఐఎమ్‌జీ–ఆర్)లో ఐఎమ్‌జీ వరల్డ్‌వైడ్ కంపెనీకి ఉన్న 50 శాతం వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేయనున్నది.
కొనుగోలు విలువ ఎంతంటే…
ఈ వాటాల కొనుగోలు విలువ రూ.52.08 కోట్లు. ఈ డీల్ పూర్తయిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు పూర్తి అనుబంధ సంస్థగా ఐఎమ్‌జీ–ఆర్ మారుతుందని, దానిని రీబ్రాండ్ చేస్తామని తెలిపింది. ఈ డీల్‌కు ప్రభుత్వ, నియంత్రణ సంస్థల ఆమోదాలు అవసరం లేదని ఈ ఏడాదిలోనే ఈ డీల్ పూర్తవ్వగలదని రిలయన్స్ సంస్థ పేర్కొంది.



