తిరుపతి రూరల్ మండలంలో ఉద్రిక్తత, ఓట్లు తొలగిస్తున్నారంటూ అధికారుల నిర్బంధం, రాత్రంతా గ్రామంలోనే సీఐ బస
చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం పుదిపట్లలో రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ ఓట్లు తొలగిస్తున్నారంటూ రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి..
చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం పుదిపట్లలో రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ ఓట్లు తొలగిస్తున్నారంటూ రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు గ్రామస్తులు. గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే అధికారులను నిర్బంధించి, ఆందోళనకు దిగారు పంచాయతీ ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు అర్థరాత్రి గ్రామానికి చేరుకున్నారు. ఎవరి ఓట్లు తొలగించడం జరగదని, సమస్యలేవైనా ఉంటే చెప్పాలంటూ ఎమ్.ఆర్ పల్లి సిఐ సురేంద్ర రాత్రంతా పుదిపట్లలోనే బస చేశారు.