పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కీలకంగా తిరుమల శ్రీవారి లడ్డు, రేషన్ పంపిణీ చేసే వాహనాల్లోనే పంపిణీ అంటూ ఫిర్యాదులు

చిత్తూరు జిల్లా పంచాయతీ ఎన్నికల ప్రచారంలో తిరుమల శ్రీవారి లడ్డు కీలకంగా మారింది. పంచాయతీ ఎన్నికల ఆఖరి దశలో ఎన్నికలు జరుగుతున్న తిరుపతి..

  • Venkata Narayana
  • Publish Date - 2:17 pm, Fri, 19 February 21
పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కీలకంగా తిరుమల శ్రీవారి లడ్డు, రేషన్ పంపిణీ చేసే వాహనాల్లోనే పంపిణీ అంటూ ఫిర్యాదులు

చిత్తూరు జిల్లా పంచాయతీ ఎన్నికల ప్రచారంలో తిరుమల శ్రీవారి లడ్డు కీలకంగా మారింది. పంచాయతీ ఎన్నికల ఆఖరి దశలో ఎన్నికలు జరుగుతున్న తిరుపతి డివిజన్ లో ఓటర్ల ఇంటికి శ్రీవారి లడ్డూ ప్రసాదం చేరుతోంది. పంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో కొన్ని పంచాయతీల్లో తనకు అనుకూలంగా ఓట్లు వేయించుకొనే ప్రయత్నంలో అభ్యర్థులు లడ్డు ప్రసాదాలను, వస్త్రాలను ఇళ్లకు చేర్చుతున్నారు. కొన్ని చోట్ల ఏకంగా రేషన్ పంపిణీ చేసే వాహనాల్లోనే లడ్డూ ప్రసాదాలను ఓటర్లకు పెడుతున్నారంటూ ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదులు అందాయి. మరి కొన్ని గంటల్లోనే ఎన్నికల ప్రచారానికి తెరపడనున్న నేపథ్యంలో అభ్యర్థులు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు.

Read also : Chalasani Srinivas Daughter : ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ కూతురు శిరీష్మ ఆత్మహత్య