ఆ మూడు గ్రామాలు మావే.. సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం

సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి మూడు గ్రామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందుతాయని ఏపీ ప్రభుత్వం భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్డుకు నివేదించింది.

ఆ మూడు గ్రామాలు మావే.. సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం
Follow us

|

Updated on: Feb 19, 2021 | 2:25 PM

SC on AP three villages : సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి మూడు గ్రామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందుతాయని ఏపీ ప్రభుత్వం భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్డుకు నివేదించింది. ఒడిశా రాష్ట్ర సర్కార్ వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని ఏపీ సర్కార్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు విజయనగరం జిల్లా కలెక్టర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు జస్టిస్‌ ఖన్‌ విల్కర్‌ ధర్మాసనం విచారణ జరిపింది. తమ భూ భాగంలోని 3 గ్రామ పంచాయతీల పేర్లు మార్చి ఏపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోందని ఒడిశా ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. ఒడిశా పిటిషన్‌పై ఏపీ ప్రభుత్వం తరఫున విజయనగరం జిల్లా కలెక్టర్‌ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. కోటియా పరిధిలోని 3 గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో భాగమేన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వం గతంలోనూ ఇక్కడ పంచాయతీ ఎన్నికలు నిర్వహించినట్టు కోర్టుకు వివరించారు. అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి మూడు గ్రామాలు వస్తాయని, ఒడిశా పిటిషన్‌ కొట్టివేయాలని విజయనగరం కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సమాధానం ఇచ్చేందుకు ఒడిశా ప్రభుత్వం తరఫు న్యాయవాది వికాస్‌సింగ్‌ నాలుగువారాల గడువు కోరారు. దీంతో ఈకేసు తదుపరి విచారణను ధర్మాసనం నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Read Also..  సంచలనంగా మారిన శైలజానాథ్‌ శపథం.. రాహుల్‌.. ఆ పని చేయకుంటే ఆత్మార్పణ చేసుకుంటానన్న ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌