Allu Arjun debut in Tamil : త్వరలో కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న అల్లువారబ్బాయి.. డైరెక్టర్ ఎవరంటే..?

తెలుగు వారికి అల్లు అర్జున్‌గా.. మళయాళం వారికి మల్లు అర్జున్‌గా.. తెలిసిన మన స్టైలిష్‌ స్టార్‌.. ఇక తంబి అర్జున్‌ గా మారబోతున్నాడు. అవును.. త్వరలో బన్నీ తమిళ్‌ సినిమాల్లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు...

Allu Arjun debut in Tamil : త్వరలో కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న అల్లువారబ్బాయి.. డైరెక్టర్ ఎవరంటే..?
Follow us
Surya Kala

|

Updated on: Feb 19, 2021 | 3:36 PM

Allu Arjun debut in Tamil : తెలుగు వారికి అల్లు అర్జున్‌గా.. మళయాళం వారికి మల్లు అర్జున్‌గా.. తెలిసిన మన స్టైలిష్‌ స్టార్‌.. ఇక తంబి అర్జున్‌ గా మారబోతున్నాడు. అవును.. త్వరలో బన్నీ తమిళ్‌ సినిమాల్లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఈ ఇదే కోలీవుడ్ లో హాట్‌ టాపిక్ గా మారింది.

అల్లు అర్జున్‌ త్వరలో గౌతమ్‌ మీనన్‌ డైరెక్టన్లో ఓ తమిళ సినిమా చేయబోతున్నాడట. ఇప్పటికే కథ విన్న బన్నీ ఈ సినిమాకు ఓకే చెప్పాడట. ఇంకొన్ని రోజుల్లో ఈ మూవీకి సంబంధించిన డీటెయిల్స్‌ కూడా అనౌన్స్ చేయనున్నరట. గౌతమ్‌ మార్క్‌ లవ్‌ స్టోరీతో ఒకే సారి.. ఇటు తెలుగు.. అటు తమిళ్‌లోను ఈ సినిమా తెరకెక్కబోతుందట. ఇక ఈ సినిమాను ఓ బడా ప్రొడ్యూసర్‌ నిర్మించబోతున్నాడట.

నిజానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే తమిళ్ స్టార్ డైరెక్టర్‌ లింగుస్వామి డైరెక్షన్‌లో ఓ సినిమా చేయాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు ఇన్నాళ్లకు బన్నీ మళ్లీ ఓ తమిళ సినిమా చేసేందుకు రంగం సిద్ధం అయింది.

ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. ఈ సినిమా తరువాత కొరటాల శివ డైరెక్షన్‌లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమా డీటెల్స్‌ను అనౌన్స్‌ చేశాడు. అయితే బన్నీ ఈ సినిమాతో పాటు గౌతమ్ మీనన్‌ సినిమాలో యాక్ట్ చేస్తాడా.. లేదా.. ముందు శివ సినిమా కంప్లీట్ చేసి.. ఆ తరువాత గౌతమ్‌తో జట్టు కడతాడో వేచి చూడాల్సిందే మరి

Also Read:

 విడుదలకు సిద్ధం అవుతున్న నవీన్ చంద్ర సినిమా.. సందేశాత్మక కథతో రూపొందిన ‘మిషన్ 2020’

సంచలనంగా మారిన శైలజానాథ్‌ శపథం.. రాహుల్‌.. ఆ పని చేయకుంటే ఆత్మార్పణ చేసుకుంటానన్న ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌