Anushka Shetty Tollywood Actress: అందానికి అందం, అభినయానికి అభినయం.. అందుకే చిత్రసీమలో శిఖరాగ్రం

అనుష్క.. ఈ పేరుకు తెలుగు సినిమా చరిత్రలో ఓ ప్రత్యేక పేజీ ఉంది. ఈమెను తెలుగు హీరోయిన్ కాదు అంటే ఎవరూ నమ్మరేమో.. అంతగా ప్రేక్షకులు మదిలో చోటు సంపాదించుకుంది నటీమణి.

Anushka Shetty Tollywood Actress: అందానికి అందం, అభినయానికి అభినయం.. అందుకే చిత్రసీమలో శిఖరాగ్రం
Anushka Shetty
Follow us

|

Updated on: Feb 19, 2021 | 5:47 PM

Anushka Shetty Tollywood Actress:  అనుష్క.. ఈ పేరుకు తెలుగు సినిమా చరిత్రలో ఓ ప్రత్యేక పేజీ ఉంది. ఈమెను తెలుగు హీరోయిన్ కాదు అంటే ఎవరూ నమ్మరేమో.. అంతగా ప్రేక్షకులు మదిలో చోటు సంపాదించుకుంది నటీమణి. సౌత్ ఇండియా నంబర్ వన్ హీరోయిన్‌గా గతంలో చక్రం తిప్పిన అనుష్క.. తెలుగు ప్రజలకు మాత్రం ఆల్‌టైమ్ ఫేవరెట్. ఈమెకు 39 ఏళ్లు అంటే ఎవరైనా నమ్ముతారా. అదే గ్లామర్, అదే క్రేజ్‌తో టాలీవుడ్‌లో తన మార్క్ సినిమాలతో దూసుకుపోతుంది అనుష్క. సినిమాలు వెంటవెంటనే చేయదు కానీ పాపులారిటీ, రెమ్యూనరేషన్ వైజ్ అనుష్క ఆల్వేస్ టాప్.

వ్యక్తిగత జీవితం :

మంగుళూరులో పుట్టిన అనుష్క పాఠశాల, కళాశాల విద్య అంతా బెంగుళూరులోనే జరిగింది. ఈమె మాతృభాష తుళు. కుటుంబ సభ్యులు ఈమెను స్వీటీ అని అని పిలుస్తారు. అనుష్క తండ్రి పేరు ఏవీ విఠల్ శెట్టి.. అనుష్క తల్లి పేరు ప్రఫుల్లా శెట్టి. అనుష్కకు సాయి రమేశ్ శెట్టి, గుణరంజన్ శెట్టి అనే ఇద్దరు సోదరులు ఉన్నారు.

సూపర్‌తో కెరీర్ ఆరంభం:

2005లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘సూప‌ర్’ సినిమాతో ఈ క‌న్న‌డ బ్యూటీ టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. మొదటి మూవీతోనే ఈ బ్యూటీలోని స్పార్క్ అటు ఇండస్ట్రీతో పాటు ఇటు ప్రేక్షకులు కనిపెట్టేశారు. ఆ త‌ర్వాత సుమంత్ ‘మ‌హానంది’లో న‌టించింది అనుష్క. ఈ రెండు సినిమాలు మంచి క్రేజ్ తీసుకురాకపోయినా.. రాజమౌళి తీసిన విక్ర‌మార్కుడుతో అమ్మడి పేరు మారుమోగిపోయింది. ఇక ఆ త‌ర్వాత 2009లో వ‌చ్చిన ‘అరుంధ‌తి’ అనుష్క ఇమేజ్‌ను గగనానికి తీసుకెళ్లింది. తెలుగు ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటడ్ చిత్రాలంటే తొలుత వినిపించే పేరు విజయశాంతి..  ఆ తర్వాతి కాలంలో ఆమె ప్లేస్‌ను రిప్లేస్ చేసింది అనుష్క. అరుందతిలో అనుష్క నటనకు బాక్సాఫీస్ షేక్ అయిపోయింది.   13 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా అప్పట్లోనే రూ. 65 కోట్లు కలెక్ట్ చేసింది.  పేరు, ప్రతిష్ఠలతో పాటు అమ్మడు రెమ్యూనరేషన్‌ కూడా భారీగా పెరిగిపోయింది. ఈ సినిమాతో అప్పటివరకు లేడీ ఓరియంటడ్ చిత్రాలంటే పెద్దగా ఆసక్తి చూపించని మేకర్స్.. అనుష్క కోసం స్పెషల్ కేర్ తీసుకుని మరీ కథలు రాయించారు. ఆ త‌ర్వాత పంచాక్ష‌రి, రుద్ర‌మ‌దేవి, భాగ‌మ‌తి, సైజ్ జీరో లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది అనుష్క‌.

గ్లామర్‌లోనూ టాప్:

కేవలం నటన మాత్రమే కాదు.. గ్లామర్‌లోనూ అనుష్క టాపే. బిల్లాలో బికినీ వేసి అందర్నీ షాక్‌కు గురిచేసిన అనుష్క.. అబ్బాయిల కలల రాకుమారిగా మారిపోయింది. మాములుగా మంచి ప్రదర్శనతో టాప్‌లేపే హీరోయిన్స్ స్కిన్ షో‌కు దూరంగా ఉంటారు. కానీ అనుష్క మాత్రం రెండు పడవల ప్రయాణం చేసి.. తాను ది బెస్ట్ అని నిరూపించుకుంది.  విక్రమార్కుడు, సింగం, రగడ, లాంటి సినిమాల్లోనూ గ్లామ‌ర్‌తో ఆకట్టుకుంది. ఇటు గ్లామర్ పాత్రలతో పాటు అటు భారీ యాక్షన్ పాత్రలకు ఆమెను మించిన ఆప్షన్ తెలుగు ఫిల్మ్ మేకర్స్‌కు దొరకడం లేదు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించే అవకాశం రావడం తన అదృష్టమని అనుష్క చెబుతూ ఉంటుంది. ‘అరుంధతి’, ‘వేదం’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’, ‘సైజ్‌ జీరో’, ‘నిశ్శబ్దం’, ‘బాహుబలి’, ‘నాన్న’… సినిమాల్లోని పాత్రలంటే ఇష్టమని పలుమార్లు చెప్పింది.

చిత్ర పరిశ్రమకు రాకముందు యోగా టీచర్:

అనుష్క సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్‌గా పని చేసిన విషయం చాలామందికి తెలుసు. అంతకు ముందు ఆమె బెంగుళూరులోని ఈస్ట్‌వుడ్ పాఠశాలలో పనిచేశారు. బెంగుళూరు విశ్వవిద్యాలయానికి అనుసంధానంగా ఉన్న మౌంట్ కార్మెల్ కాలేజ్ నుంచి బి.సి.ఏ పట్టా పొందింది. అయితే కంప్యూటర్ రంగంలో ఇంట్రస్ట్ లేక, ఫిట్‌నెస్ రంగంలో రాణించాలని అనుకుందట. అలా యోగా టీచర్‌గా మారింది.

తెరవెనుక స్వీటీ చాలా సింపుల్:

తెరపై పాత్రను బట్టి కనిపించే స్వీటీ.. తెర వెనుక మాత్రం అనుష్క చాలా పద్ధతిగా, సింపుల్‌గా ఉంటారు. సల్వార్‌ కమీజ్‌, చీరల్లో మాత్రమే ఆమె ధరిస్తుంటారు. సినిమా షూటింగ్‌ పూర్తయితే, ఇక అనుష్క బయట కనిపించదు. ఇంటికే పరిమితమైపోయి… కుటుంబ సభ్యలతో సమయం గడుపుతుంది. బయట లైట్‌గా కూడా మేకప్ వేసుకోదు అనుష్క.

అనుష్క అంటే అందం, హైట్…

అనుష్క అనగానే.. అందంతోపాటు ఆమె హైట్ కూడా గుర్తొస్తుంటుంది. 6 అడుగుల హీరోలకు ఆమె బాగా సరిపోతుంది. ఇక లేడీ ఓరియంటెడ్ సినిమాలకైతే బెటర్ ఆప్షన్. ఇక ఎత్తు వల్ల కొన్నిసార్లు సమస్యలు కూడా తప్పవు.  మరి ఎత్తు వల్ల సమస్యలు వచ్చాయా? అని ఆమెను అడిగితే.. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అది సమస్య అవుతుందేమోనని భయపడ్డానని. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇబ్బంది లేదని చెప్పింది. తన కంటే కాస్త ఎత్తు తక్కువ ఉన్న హీరోలతో చేసిన సినిమాలు కూడా  సూపర్ హిట్స్ అయ్యాయని చెప్పుకొచ్చారు అనుష్క.

సోషల్ మీడియాకు దూరం:

అనుష్క సోషల్ మీడియాకు ఎప్పుడూ దూరం పాటిస్తూ వచ్చింది. ఇటీవలే సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ..  ట్విటర్‌ గురించి తెలుసుకుంటున్నానని. ..నెమ్మదిగా జవాబులు ఇస్తున్నందుకు క్షమించాలని చెప్పింది.

కథ నచ్చితే ఎటువంటి పాత్రకైనా సిద్దం:

కథ నచ్చితే ఎటువంటి పాత్రకైనా రెడీ అంటుంది హీరోయిన్ అనుష్క. అందుకు చక్కటి ఉదాహరణ వేదం సినిమా. అనుష్క జేజమ్మగా గుర్తుంచుకుంటారు సినీ జనాలు. అలాంటి అనుష్క వేశ్యపాత్రలో నటించి, మెప్పించడం కత్తి మీద సామే. ఆ పాత్ర వేసి.. ప్రేక్షకుల మెప్పు పొంది నటిగా తనకు తానే సాటి అని నిరూపించుకుంది అనుష్క. ఆ చిత్రంలో అమలాపురం సరోజగా అదరగొట్టింది..అనుష్క సాహసానికి మరో ఉదాహరణ సైజ్ జీరో చిత్రాన్ని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కోసం పెద్ద సాహసమే చేసింది అనుష్క. పాత్ర కోసం ఊహించని బరువు పెరిగి అందర్నీ షాక్‌కు గురిచేసింది.

అనుష్క మంచి మనసుకు అన్నీ ఇండస్ట్రీలు ఫిదా:

అందమైన రూపమే కాదు. అందమైన మనసూ అనుష్క సొంతం. 15 ఏళ్ళ సుధీర్గ సినీ ప్రయాణంలో ఏనాడు ఆమె వివాదాల జోలికి పోలేదు. తనపై ఎన్ని రూమర్లు వచ్చినా మౌనంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్లేది. అనవసరమైన టాపిక్స్ విషయంలో చాలా దూరంగా ఉంటుంది. సెట్‌లో క్రమశిక్షణకు మారుపేరు అని అందరూ చెబుతూ ఉంటారు. ఇటీవల అనుష్క 15 ఏళ్ల సినీ ప్రయాణం గురించి ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అప్పటివరకు ఇండస్ట్రీ జనాలకు మాత్రమే తెలిసిన అనుష్క మంచితనం.. ఆ కార్యక్రమం ద్వారా బయటి జనాలకు కూడా తెలిసింది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, చారిటీలకు డొనేషన్స్ ఇస్తుంది ఈ బ్యూటీ. అయితే తాను కుడిచేత్తో సాయం చేసిన విషయం.. ఎడమచేతికి కూడా తెలియనీయదు.

అనుష్క పెళ్లి ఎప్పుడు ??

అనుష్కకి ఇప్పుడు 39 సంవత్సరాలు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్ల నుంచి అనుష్క పెళ్లి ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఈ విషయంలో ఎన్ని వార్తలు వచ్చినా అవి రూమర్స్‌గా మిగిలిపోయాయి తప్ప నిజం కాలేదు. అనుష్కని చాలా మందితో ముడి పెట్టారు. మరి దేవసేన చేయి పట్టుకునే ఆ రాజకుమారుడు ఎవరో.. ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే.

అవార్డులు-రివార్డులు :

వేదం చిత్రానికిగానూ 2016 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకుంది అనుష్క. వేదం, రుద్రమదేవి, అరుందతి చిత్రాలకు సౌత్ నుంచి ఉత్తమనటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కించుకుంది. అవార్డుల సంగతి పక్కనబెడితే అభిమానగణం. అవును స్టార్ హీరోలతో సమానంగా అనుష్క ఫ్యాన్ బేస్ ఉంటుంది. బ్యూటీ ఫ్లస్ టాలెంట్ ఫ్లస్ బిహేవియర్.. అవే ఆమెను అగ్రపథాన నిలబెట్టాయి అని  చెప్పుకోవచ్చు. మున్ముందు అనుష్క ఇంకా ఎన్ని సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

Also Read:  భారతీయ చలనచిత్ర ‘బాహుబలి’.. యూనివర్సల్ హీరోగా ఎదుగుతున్న తెలుగు గని.. ప్రభాస్