Weather Report: నేడు, రేపు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం.. ఉరుములు, మెరుపులతో కూడిన..

Rain Alert In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. క్రమంగా చలి తీవ్రత తగ్గిపోతోందనుకుంటోన్న సమయంలో మళ్లీ చలి ఒక్కసారిగా పెరిగిపోయింది. అనుకోని వర్షం కారణంగా..

Weather Report: నేడు, రేపు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం.. ఉరుములు, మెరుపులతో కూడిన..
Weather Report
Follow us

|

Updated on: Feb 20, 2021 | 7:07 AM

Rain Alert In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. క్రమంగా చలి తీవ్రత తగ్గిపోతోందనుకుంటోన్న సమయంలో మళ్లీ చలి ఒక్కసారిగా పెరిగిపోయింది. అనుకోని వర్షం కారణంగా వాతావరణం మారిపోయింది. ఇదిలా ఉంటే రానున్న రెండో రోజుల్లోనూ తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని అధికారులు తెలిపారు. శ్రీలంక తీరం నుంచి ఉత్తర తమిళనాడు వరకు నైరుతి బంగాళ ఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడనుంది. దీని కారణంగా నేడు (శనివారం) దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విదర్భలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల వర్షాలు పడనున్నాయి. తెలంగాణలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఆదివారం కూడా తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Also Read: BUFFALO ATTACK: ఆదిలాబాద్ జిల్లాలో వింత ఘటన.. బర్రెలకు.. దున్నలకు కోపమొచ్చింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!