దేవుడి దగ్గరకి వెళ్తున్నానంటూ యువకుడి అదృశ్యం.. మదనపల్లె ఘటన మరువకముందే.. చిత్తూరులో మరో కలకలం..
మదనపల్లెలో చోటు చేసుకున్న ఘటన పెద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ ఘటన మరువకముందే ఓ యువకుడి అదృశ్యమైన ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతోంది.
Chittoor District Crime: నమ్మకాలు, విశ్వాసాలు ఉండొచ్చు.. కానీ హద్దు దాటకూడదు. ఎప్పుడైతే అవి మూఢనమ్మకాలుగా, అంధ విశ్వాసాలుగా మారుతాయో.. అప్పుడే మనిషి విచక్షణ కోల్పోతాడు. సమాజానికి పెద్ద ముప్పుగా మారతాడు. సరిగ్గా దీనిని ప్రతిబింబిస్తూ మదనపల్లెలో చోటు చేసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ ఘటన మరువకముందే ఓ యువకుడి అదృశ్యమైన ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతోంది.
దేవుడి దగ్గరకు వెళ్తున్నానంటూ గంగవరం మండలానికి చెందిన గణేష్ సమీప డిగ్రీ కాలేజీలో బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఈ నెల 21వ తేదీన తల్లిదండ్రులకు అతడు రెండు పేజీల లేఖ రాసి అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి తమ కొడుకు ఇంటికి రాకపోవడంతో వారు అతని కోసం అన్ని ప్రాంతాల్లోనూ వెతుకుతున్నారు. మదనపల్లె ఘటన నేపధ్యంలో తన బిడ్డకు ఏం జరగకూడదని వారు ప్రార్ధిస్తున్నారు. అటు గణేష్ తన వెంట బైక్, సెల్‌ఫోన్, పుస్తకాల బ్యాగ్‌ను తీసుకెళ్లాడు. యువకుడిలో భక్తిభావం ఎక్కువగా ఉందని.. కానీ అది మూఢత్వం స్థాయిలో లేదని బంధువులు చెబుతున్నారు. కాగా, తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి…
హైదరాబాద్ నగర ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. త్వరలోనే రోడ్డెక్కనున్న డబుల్ డెక్కర్ బస్సులు.!
ఏపీ: జూన్ 7 నుంచి ‘పది’ పరీక్షలు.. ప్రాధమిక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ.. మే 31 వరకు తరగతులు..