ప్రకాశం జిల్లాలో దారుణం.. మరో వ్యక్తితో ప్రేయసి పెళ్లి జరిపించారని.. భగ్నప్రేమికుడు ఏం చేశాడంటే..!

ఓ భగ్న ప్రేమికుడు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.

ప్రకాశం జిల్లాలో దారుణం.. మరో వ్యక్తితో ప్రేయసి పెళ్లి జరిపించారని.. భగ్నప్రేమికుడు ఏం చేశాడంటే..!
Bihar's Family Suicide
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 29, 2021 | 1:16 PM

Young man commits suicide :  ఎంతోకాలంగా ప్రేమించిన యువతి మరో యువకుడితో పెళ్లికి సిద్ధమైంది. ఇది భరించలేని ఓ భగ్న ప్రేమికుడు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మార్టూరు మండలంలోని రాజుపాలెం తూర్పు ఎస్సీ కాలనీకి చెందిన బైరపోగు కాసియ్య, భూలక్ష్మి దంపతుల కుమారుడు కిశోర్‌ (21) బేల్దారి పని చేస్తుంటాడు. అతడు ఏడాది నుంచి అదే కాలనీకి చెందిన ఓ బాలికతో ప్రేమయాణం సాగిస్తున్నాడు. ఇంతలో ఐదు నెలల క్రితం అదే కాలనీకి చెందిన మరో యువకుడితో పెద్దలు బాలికకు వివాహం జరిపించారు. అయితే, పెళ్లి ఏమాత్రం ఇష్టం లేని బాలిక భర్త వదిలి కిశోర్ ఇంటికి వచ్చేసింది.

దీంతో ఆమె భర్త తరపు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, ఐసీడీఎస్‌ అధికారులు కలిసి బాలికకు, కిశోర్‌కు రెండు రోజుల క్రితం పోలీసుస్టేషన్‌లో కౌన్సిలింగ్‌ ఇచ్చి తిప్పి పంపించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో టవల్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా గమనించిన బంధువులు అతడిని మార్టూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే, కిశోర్‌ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also… ఏపీ పంచాయతీ పోరుః ఆ జిల్లాలో 13 గ్రామాల ఎన్నికలకు బ్రేక్… విలీనం, విభజనపై హైకోర్టు స్టే..!