ఏపీ పంచాయతీ పోరుః ఆ జిల్లాలో 13 గ్రామాల ఎన్నికలకు బ్రేక్… విలీనం, విభజనపై హైకోర్టు స్టే..!

ఏపీ హైకోర్టు విభజించిన 13 పంచాయితీలకు ప్రస్తుతం ఎన్నికలు ఆపాలని స్టే విధించింది.

ఏపీ పంచాయతీ పోరుః ఆ జిల్లాలో 13 గ్రామాల ఎన్నికలకు బ్రేక్...  విలీనం, విభజనపై  హైకోర్టు స్టే..!
Follow us

|

Updated on: Jan 29, 2021 | 9:33 AM

AP High court on kadapa villages : కడప జిల్లాలోని 13 గ్రామపంచాయతీలకు ఎన్నికలకు బ్రేక్ పడింది. ఇటీవల విభజన చేస్తూ 13 పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అయితే, విభజనను వ్యతిరేకిస్తూ కొందరు నేతలు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన ఏపీ హైకోర్టు విభజించిన 13 పంచాయితీలకు ప్రస్తుతం ఎన్నికలు ఆపాలని స్టే విధించింది. హైకోర్టు స్టేతో 13 పంచాయతీలకు ఎన్నికలు నిలిచిపోయాయి. కాగా, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వివిధ కారణాలతో 90 పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోయాయి.

ఇదిలావుంటే, కడప జిల్లాలో నేడు మూడు నియోజకవర్గాల్లోని 206 గ్రామ పంచాయతీలకు నామినేషన్లు ప్రారంభం అవుతున్నాయి. ఇవాళ్టి నుంచి తొలివిడతలో ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేల్ నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలవుతోంది. ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బరిలో ఉన్న అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు.

Read Also…  నేటి నుంచే నామినేషన్ల పర్వం.. ఏకగ్రీవాలపై కొనసాగుతున్న వివాదం.. ఆన్‌లైన్‌ నామినేషన్లకి పెరుగుతున్న డిమాండ్‌

Latest Articles