Ugadi 2025: శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు.. భక్తులకు దేవస్థానం కీలక సూచనలు..!
ఉగాది బ్రహ్మోత్సవాలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నరు. ఎక్కువ మంది కాలి నడకన శ్రీశైలానికి చేరుకుంటున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రీశైలం దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి మొదలైన ఉగాది మహోత్సవాలలో సాయంత్రం 5 :30 గంటలకు అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు..ఈ క్రమంలో భక్తులకు కీలక సూచనలు చేసింది దేవస్తానం.

నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి నేటి నుండి 31 వ తేదీ వరకు 5 రోజులపాటు జరిగే ఉగాది మహోత్సవాలకు శాస్త్రోక్తంగా శ్రీస్వామివారి యాగశాల ప్రవేశం చేసి ఆలయ అర్చకులు, వేదపండితులు, ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు ఘనంగా ప్రారంభించారు ముందుగా అర్చకులు,వేదపండితులు యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతిపూజ,శివసంకల్పం,చండీశ్వరపూజ,కంకణాధారణ,అఖండ దీపారాధన,వాస్తు పూజ,వాస్తు హోమం వివిధ విశేష పూజలు నిర్వహించి ఉగాది మహోత్సవాకు వైభవంగా శ్రీకారం చుట్టారు.
అయితే కన్నడ భక్తుల సౌకర్యార్థం గత 10 నుండి నిన్నటి వరకు 4 విడతలుగా శ్రీస్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం కలిపించిన ఆలయ ఈవో శ్రీనివాసరావు ఈరోజు ఉగాది మహోత్సవాలు ప్రారంభం కావడంతో, నేటి నుండి ప్రతి ఒక్క భక్తునికి సౌకర్యవంతమైన దర్శన కల్పన కోసం, అలానే భక్తులు త్వరితగతిన దర్శనం చేసుకునేందుకు శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. అలాగే ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ఇప్పటికే కన్నడ భక్తులకు క్షేత్రంలో పలుచోట్ల చలువ పందిళ్లు శ్యామియనాలు, నీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు
నేటి నుంచి మొదలైన ఉగాది మహోత్సవాలలో సాయంత్రం 5 :30 గంటలకు అంకురార్పణ,అగ్నిప్రతిష్టాపన పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీస్వామి అమ్మవారు బృంగివహంపై ఆశీనులై ప్రత్యేక పూజలందుకొని క్షేత్రపురవీధుల్లో గ్రామోత్సవంగా భక్తులకు దర్శనమిస్తూ బృంగివహంపై విహరించనున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..