ఎర్ర సముద్రంలో మునిగిపోయిన 2300 టన్నుల జలాంతర్గామి, ఆరుగురు దుర్మరణం!
ఈజిప్టులో భారీ ప్రమాదం సంభవించింది. హుర్ఘడ నగరానికి సమీపంలోని ఎర్ర సముద్రంలో పర్యాటక జలాంతర్గామి మునిగిపోచింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించినట్లు తెలుస్తోంది. 14 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో జలాంతర్గామిలో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించింది.

ఈజిప్టులో ఘోర ప్రమాదం సంభవించింది. హుర్ఘడ నగరానికి సమీపంలోని ఎర్ర సముద్రంలో పర్యాటక జలాంతర్గామి మునిగిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారని, 14 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో జలాంతర్గామిలో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
స్థానిక వర్గాల సమాచారం ప్రకారం, గురువారం(మార్చి 27) ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఈఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు రెస్క్యూ టీమ్ 29 మందిని సురక్షితంగా తరలించింది. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అయితే, ఈ ప్రమాదం వెనుక గల కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. అదే సమయంలో, సాంకేతిక లోపం, భద్రతా ప్రమాణాలను విస్మరించడం లేదా ప్రతికూల సముద్ర పరిస్థితులు ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
హుర్ఘడ నగరం సమీపంలోని ఎర్ర సముద్ర తీరంలో పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల, ఈ ప్రమాదాల గురించి ఆందోళనలు పెరిగాయి. పర్యాటక జలాంతర్గాములపై భద్రతా తనిఖీలను కఠినతరం చేయాలనే ఒత్తిడి ఇప్పుడు ప్రభుత్వంపై పెరుగుతోంది. ఈ ప్రమాదం తర్వాత, ఎర్ర సముద్రంలో పనిచేస్తున్న ఇతర పర్యాటక జలాంతర్గాముల భద్రత గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రమాదంపై దర్యాప్తునకు అధికారులను ఆదేశించింది. ఈ సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
హుర్ఘడ ఈజిప్టులోని ఒక ప్రధాన పర్యాటక కేంద్రం. ఇది అందమైన తీరప్రాంతాలు, పగడపు దిబ్బలకు ప్రసిద్ధి చెందింది. పర్యాటకులకు నీటి అడుగున అనుభూతిని అందించడానికి, ఇక్కడ అనేక రకాల పడవలు, జలాంతర్గాములు నడుస్తాయి. ఇటీవల సంవత్సరాలలో ఈ ప్రాంతంలో పర్యాటక పడవలు అనేక ప్రమాదాలకు గురయ్యాయి. అంతకుముందు, గత ఏడాది నవంబర్‌లో ‘సీ స్టోరీ’ అనే పర్యాటక పడవ మునిగిపోయింది. దీనిలో 11 మంది మరణించారు. 35 మందిని రక్షించారు.
ఎర్ర సముద్రం ఒడ్డున జరుగుతున్న ఈ సంఘటనలకు సంబంధించి చాలాసార్లు ప్రశ్నలు తలెత్తాయి. గత ఐదు సంవత్సరాలలో ఈ ప్రాంతంలో ఇలాంటి 16 ప్రమాదాలు జరిగాయని, వాటిలో చాలా మంది మరణించారని బ్రిటిష్ దర్యాప్తు బృందం గత నెలలో ఒక నివేదికలో వెల్లడించింది. గతంలో జరిగిన ప్రమాదాలకు సముద్రాలలో అలల ఎగసిపడే కారణమని ఈజిప్టు అధికారులు ఆరోపించారు. అయితే చాలా మంది పర్యాటకులు ఈ ప్రమాదాలకు భద్రతా ప్రమాణాలు లేకపోవడమే కారణమని ఆరోపించారు.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..