Watch: అతను డెలివరీ బాయా..? స్పైడర్ మ్యానా? ‘స్టంట్’ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
సోషల్ మీడియాలో రకరకాల వీడియో వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా అమెజాన్ డెలివరీ బాయ్ వీడియో ఒక సోషల్ మీడియా ప్రపంచంలో వైరల్ అవుతోంది. ఇంటికి ఆర్డర్ డెలివరీ చేసేందుకు వచ్చిన ఆ వ్యక్తి ఏమి చేశాడనేది ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారింది. పరిస్థితి ఎలా ఉందంటే జనాలు అతన్ని స్పైడర్ మ్యాన్‌తో పోలుస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో, డెలివరీ బాయ్ గేటు తీసుకుని ఇంటి ప్రధాన ద్వారం గుండా లోపలికి వస్తున్నాడు. ఆ వ్యక్తి పార్శిల్ ఇచ్చేలోపే, ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కలు అకస్మాత్తుగా అతని వైపు పరిగెత్తుకుంటూ వచ్చాయి. ఇది చూసి ఆ వ్యక్తి భయపడ్డాడు. తరువాత ఏమి జరిగిందో, నేను చెప్పకంటే, ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా నోరు వెళ్లబెట్టాల్సిందే..! వీడియో చూడండి..
View this post on Instagram
కుక్కలు తన వైపు వస్తున్నట్లు చూసి, ఆ డెలివరీ బాయ్ భయపడి, స్పైడర్ మ్యాన్ లాగా ఛాతీ అంత ఎత్తైన గేటుపై నుంచి అవళీలుగా దూకేశాడు. నన్ను నమ్మండి, మీరు ఖచ్చితంగా ఆ క్లిప్‌ని రెండుసార్లు చూస్తారు. ఎందుకంటే, ఆ వ్యక్తి అద్భుతంగా జంప్ చేయడం కెమెరాలో బంధి అయ్యింది. @djempress_ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేసి, ‘స్పైడర్‌మ్యాన్ అమెజాన్ కోసం డెలివరీ చేస్తున్నాడు’ అని రాశారు. మార్చి 24న అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 3 లక్షలకు పైగా నెటిజన్లు లైక్ చేయగా, చాలా మంది వినియోగదారులు దీనిపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఒక వినియోగదారుడు, “ఈ వ్యక్తి ఎంత గొప్ప జంప్ చేశాడు” అని వ్యాఖ్యానించారు. డెలివరీ బాయ్ స్టంట్ చూసి కుక్క కూడా ముగ్ధుడై ఉండేదని మరొక యూజర్ అన్నారు. మరొక వినియోగదారు ఇలా రాశారు, ఇది ఇప్పటివరకు అత్యుత్తమ జంప్ కాదా? అతను ఎంత తేలికగా దూకాడు. దీనిని స్మూత్ జంప్ అంటారు అని మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు. భయంతో అన్నయ్య ఆ ప్యాకెట్ ను కూడా కింద పడనివ్వలేదు అని పేర్కొన్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..