Viral Video: ఈ ప్రొఫెసర్ డ్యాన్స్ చూస్తే మీరు సైతం ఫిదా అవుతారు..
నీట్‌గా టక్ చేసుకొని, చేతిలో బుక్స్ పట్టుకొని సీరియస్‌గా క్లాస్‌రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. సైలెన్స్... అంటూ విద్యార్ధులను అలెర్ట్ చేసి.. ఎప్పుడూ పాఠాలు.. మార్కులు.. విద్యార్ధుల అల్లరితో గడిపే లెక్చరర్సే మనకు తెలుసు. నిత్యం క్లాస్ రూమ్ లో సీరియస్ గా పాఠాలు చెప్పే ఓ లెక్చరర్ సరదాగా స్టెప్పులేస్తే ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి... అదికూడా మైఖెల్ జాక్సన్ పాటకు డాన్స్ చేస్తే...ఎలా ఉంటుంది.. అలాంటి ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ప్రొఫెసర్ చేసిన డాన్స్‌కి అటు స్టూడెంట్సే కాదు ఇటు నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు. బెంగళూరులోని న్యూ హారిజాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో నిర్వహించిన ఓ సాంస్కృతి కార్యక్రమంలో ఓ ప్రొఫెసర్ డాన్స్ చేశారు. మైఖేల్ జాక్సన్ పాటకు అచ్చం మైఖేల్‌లానే డాన్స్ చేసి అదరగొట్టారు. ఇక తమ లెక్చరర్ డ్యాన్స్ చేయడం చూసి విద్యార్థులు ఉత్సాహంతో ప్రొఫెసర్‌ను ఎంకరైజ్ చేశారు. క్లాస్ రూమ్ దద్దరిల్లిపోయేలా ఈలలు, చప్పట్లతో హోరెత్తించారు. ప్రొఫెసర్ రవి చేసిన ఈ డ్యాన్స్‌ను ఓ విద్యార్థి వీడియో తీసి ఇన్ స్టాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను లక్షలమందికి పైగా వీక్షించారు. బోలెడు మంది కామెంట్స్ పెడుతూ.. షేర్ చేస్తున్నారు.
సార్ జోష్ ఏమాత్రం తగ్గలేదంటూ ఆయన పూర్వ విద్యార్థులు ఈ వీడియోకు కామెంట్లు పెడుతున్నారు. మంచి డ్యాన్సర్ మాత్రమే కాదు, మంచి లెక్చరర్ కూడా అని, ఆయన శిష్యులు కావడం తమ అదృష్టమని కామెంట్లలో చెబుతున్నారు. మరో యూజర్ కాస్త ఫన్నీగా స్పందిస్తూ.. రవి సార్ క్లాస్‌ను స్టూడెంట్స్ ఎప్పుడూ మిస్ అయి ఉండరు.. అంటూ కామెంట్ చేశారు.
View this post on Instagram