చైనాలో 323 మంది మెడకు వేలాడుతున్న కత్తి.. మరణ శిక్ష తప్పదా?
తైవాన్ స్వతంత్రంగా ఉండాలని కోరుకునే వారి గురించి సమాచారం అందించాలని కోరుతూ చైనా బుధవారం(మార్చి 26) ఒక ఇ-మెయిల్ ఐడిని విడుదల చేసింది. చైనాకు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్నారని ఆరా తీసింది. CGTN ప్రకారం, ఇప్పటివరకు 323 మంది పేర్లు ఆ మెయిల్ ఐడిలో కనిపించాయి. దీంతో చైనా నిఘా వర్గాలు విచారణ చేపట్టాయి.

తైవాన్ స్వతంత్రంగా ఉండాలని కోరుకునే వారి గురించి సమాచారం అందించాలని కోరుతూ చైనా బుధవారం(మార్చి 26) ఒక ఇ-మెయిల్ ఐడిని విడుదల చేసింది. చైనాకు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్నారని ఆరా తీసింది. CGTN ప్రకారం, ఇప్పటివరకు 323 మంది పేర్లు ఆ మెయిల్ ఐడిలో కనిపించాయి. దీంతో చైనా నిఘా వర్గాలు విచారణ చేపట్టాయి. అయితే చైనాలో రాజద్రోహానికి పాల్పడితే శిక్ష మరణమే. ఇప్పుడు ఈ వ్యక్తులపై దర్యాప్తు కొనసాగుతోంది. ఎవరైనా దోషిగా తేలితే, అతనికి మరణశిక్ష విధించవచ్చని తెలుస్తోంది.
ఈ వ్యవహారంపై స్టేట్ కౌన్సిల్ తైవాన్ వ్యవహారాల కార్యాలయ ప్రతినిధి చెన్ బిన్హువా స్పందించారు. గుర్తించిన వారిలో కొంతమంది తైవానీస్ రాజకీయ ప్రముఖులు, సంస్థ స్పాన్సర్లు, అలాగే తైవాన్ స్వాతంత్ర్యంను సమర్థించే ఇంటర్నెట్ ప్రభావశీలులు ఉన్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీని నిరాధారమైన ఆరోపణలతో అణచివేయడం, చైనా ఏకీకరణకు మద్దతు ఇచ్చే సంస్థలను రద్దు చేస్తామని బెదిరించడం, తైవాన్‌లో నివసిస్తున్న ప్రధాన భూభాగంలో జన్మించిన జీవిత భాగస్వాముల చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను స్పష్టంగా ఉల్లంఘించడం వంటి వారి తీవ్రమైన కార్యకలాపాలు ఈమెయిల్‌లలో బహిర్గతమయ్యాయని ఆయన అన్నారు. సంబంధిత చైనా అధికారులు వాస్తవాలు, చట్టపరమైన నిబంధనల ఆధారంగా చర్యలు తీసుకుంటారని చెన్ బిన్హువా తెలిపారు. “తైవాన్ స్వాతంత్ర్యం” కార్యకలాపాలకు పాల్పడిన వారిని, సహకారులను జవాబుదారీగా ఉంచుతారని చెన్ బిన్హువా అన్నారు. దర్యాప్తు తర్వాత, 323 మందిపై వచ్చిన ఆరోపణలు నిజమని రుజువైతే, వారికి మరణశిక్ష తప్పదన్నారు.
దశాబ్దాలుగా చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. తైవాన్‌ను తన భాగంగా చైనా భావిస్తుంది. అయితే తైవాన్ తనను తాను ప్రత్యేక దేశంగా చెప్పుకుంటుంది. చైనా నుంచి స్వాతంత్ర్యం కోసం తైవాన్ నిరంతరం పోరాడుతోంది. ప్రపంచంలోని చాలా దేశాలు తైవాన్‌ను చైనాలో ఒక ముఖ్యమైన భాగంగా భావిస్తాయి. ఇటీవలి కాలంలో, చైనాతో తీవ్ర ఉద్రిక్తత కారణంగా, తైవాన్ ప్రభుత్వానికి చాలా సహాయం చేసింది అమెరికా. అయితే దీనిని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..