Trending: చెత్తలో దొరికిన వస్తువు ఓ మహిళ జీవితాన్నే మార్చేసింది..!
అదృష్టం ఉంటే అది మీ అదృష్టాన్ని ఎప్పుడు మారుస్తుందో చెప్పలేం. దీనికి సంబంధించిన ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. అందులో ఒక మహిళ పురాతన వస్తువుల సేకరణ అలవాటు ఉంది. ఇందులో భాగంగానే పురాతన వస్తువుల్లో కనిపించిన ఒక పెయింటింగ్‌ను రూ.1000కు కొన్నారు. ఇప్పుడు అది ఏప్రిల్ 10న రూ.8.5 కోట్లకు అమ్ముడుపోనుంది.

అదృష్టం కలిసి వస్తే.. ఎవరు ఆపాలేరంటారు. దీని గురించి ఇంగ్లీషులో ఒక సామెత ఉంది. “పుస్తకాన్ని దాని కవర్ ద్వారా తీర్పు చెప్పవద్దు”. ఈ విషయాలు కేవలం పుస్తక సంబంధమైనవి కావు, కొన్నిసార్లు నిజ జీవితంలో కూడా అన్వయించుకోవచ్చు. ఈ సామెతకు సంబంధించిన ఒక కథ ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఒక పెయింటింగ్ ఒక స్త్రీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. నేడు ఆ పెయింటింగ్ కారణంగానే ఆ మహిళ లక్షాధికారి కాబోతున్నారు..
ఆంగ్ల వెబ్‌సైట్ న్యూయార్క్ పోస్ట్‌లో ప్రచురితమైన వార్త ప్రకారం, పెన్సిల్వేనియా నివాసి అయిన హైడీ మార్కో, సాల్వేజ్ గూడ్స్ యాంటిక్స్ యజమాని అయిన ఆమె అక్కడ పురాతన వస్తువులను మాత్రమే ఉంచుతారు. ఇది ప్రజలను చాలా ఆకర్షిస్తుంది. ఈ నేపథ్యంలోనే జనవరిలో మోంట్‌గోమెరీ కౌంటీలోని ఒక పురాతన వస్తువుల దుకాణంలో వేలానికి వెళ్లారు. తద్వారా తన సేకరణను పెంచుకోవలనుకున్నారు. ఈ సమయంలో, ఆమెకు ఒక పెయింటింగ్ బాగా నచ్చింది. అమె వేలంలో పాల్గొని ఆ పెయింటింగ్ కాస్త ఖరీదు అయినా సరే కొనుగోలు చేశారు.
ఆ పెయింటింగ్ కోసం ఆ మహిళ కేవలం 12 డాలర్లు అంటే దాదాపు 1 వేయి రూపాయలు చెల్లించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్కడ 1,000 డాలర్ల నుండి 3,000 డాలర్ల వరకు చాలా పెయింటింగ్‌లు పడి ఉన్నాయి. కానీ ఆ పెయింటింగ్ చూసిన తర్వాత ఆమెకు ఏమి అనిపించిందో ఆ మహిళకు తెలియదు. ఆమె దానిని కొనుగోలు చేసింది. అయితే, ఇంటికి వచ్చిన తర్వాత ఈ పెయింటింగ్ చూసినప్పుడు, ఆమె చాలా ఆశ్చర్యపోయింది. ఇది చాలా అరుదైన, విలువైన పెయింటింగ్ అని ఆమె అర్థం చేసుకుంది. దాని వెనుక ఫ్రాన్స్‌కు చెందిన పురాణ ఇంప్రెషనిస్ట్ రెనోయిర్ సంతకం ఉంది.
హైడీ కూడా పాత విషయాలలో నిపుణురాలు కాబట్టి ఆమె దీన్ని అర్థం చేసుకోగలిగింది. ఆమె దానిని పరిశోధించినప్పుడు, ఆ చిత్రం రెనోయిర్ భార్య అయి ఉండవచ్చని, ఆమె పేరు అలైన్ చారిగోట్ అని, అది 1800ల నాటిదని ఆమె గ్రహించింది. దీని గురించి, ఆమె మరొక ఆర్ట్ అప్రైజర్‌ను సంప్రదించారు. ఆ చిత్రం నిజమని అంగీకరించారు. ఇప్పుడు దానిని వచ్చే ఏప్రిల్ 10న వేలం వేయాలని భావిస్తున్నారు. అంతా సవ్యంగా జరిగితే ఆ మహిళకు సులభంగా రూ. 8.5 కోట్లు ప్రతిఫలంగా లభిస్తాయని భావిస్తున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..