Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Water Bottles: వాటర్ బాటిల్ నీటిలో ప్రాణాలు తీసే మహమ్మారి.. ఈ ఒక్కటి చేయకుంటే మీ పని ఖతమే!

వాటర్ బాటిల్ ను ఎక్కువ కాలం వాడుతున్న కొద్దీ అందులో నీరు తాగిన ప్రతిసారీ దానిలో బ్యాక్టీరియా చేరుతుంది. రోజు గడిచే కొద్దీ ఇది లక్షల సంఖ్యలో పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీన్ని నివారించేందుకు ఏం చేయాలో వారు వివరిస్తున్నారు. అధ్యయనంలో చాలామంది తమ బాటిళ్లను శుభ్రం చేసే అలవాటు లేకపోవడం లేదా చాలా తక్కువగా శుభ్రం చేయడం తేలింది.

Water Bottles: వాటర్ బాటిల్ నీటిలో ప్రాణాలు తీసే మహమ్మారి.. ఈ ఒక్కటి చేయకుంటే మీ పని ఖతమే!
Water Bottles Health Issues With Bacteria
Follow us
Prashanthi V

| Edited By: Ram Naramaneni

Updated on: Mar 30, 2025 | 10:18 PM

ఇండియానాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయంలో ఆహార భద్రతా నిపుణుడైన కార్ల్ బెహ్న్కే వాడిన బాటిళ్ల పరిశుభ్రతపై పరిశోధన చేపట్టారు. ఒకసారి బాటిల్‌లో కాగితపు తుండును నింపి కొంతకాలం తర్వాత చూసినప్పుడు దానిపై సన్నని పొర ఏర్పడినట్లు గమనించి ఆశ్చర్యపోయారు. “తుండు తీసేసరికి అది తెల్లగా మారింది. బ్యాక్టీరియా పెరుగుతున్నట్లు అనిపించింది” అని ఆయన తెలిపారు.

నీరు తాగడం శరీర హైడ్రేషన్‌కు ముఖ్యమైనప్పటికీ, బాటిళ్లను ఎక్కడికి వెళ్లినా తీసుకెళ్లడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి ఏం చేయాలి? బాటిల్‌లో నీటిని ఎక్కువసేపు నిల్వ చేస్తే బ్యాక్టీరియా గణనీయంగా పెరుగుతుంది. మానవ శరీరంలో ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియా 37 డిగ్రీల సెల్సియస్ వద్ద జీవిస్తుంది, 20 డిగ్రీల వద్ద కూడా పెరుగుతుంది.

సింగపూర్‌లో మరిగించిన కుళాయి నీటితో చేసిన అధ్యయనంలో, రోజంతా బాటిల్‌లో నీటిని వాడితే బ్యాక్టీరియా పెరుగుతుందని తేలింది. మధ్యాహ్నం నాటికి ఒక మిల్లీలీటర్ నీటిలో సగటున 75,000 బ్యాక్టీరియా, 24 గంటల్లో 1 నుంచి 2 మిలియన్ల బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతాయని కనుగొన్నారు.

బాటిల్‌ను ఎలా కడగాలి?

ప్రతి ఉపయోగం తర్వాత బాటిల్‌ను శుభ్రం చేయడం ఉత్తమం. ఫ్రీస్టోన్ సూచన ప్రకారం, 60 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత గల వేడి నీటిలో డిష్ వాషింగ్ సబ్బు కలిపి 10 నిమిషాలు నానబెట్టి, మళ్లీ వేడి నీటితో కడగాలి. తర్వాత గాలిలో ఆరనివ్వాలి. తేమ ఉన్న చోట బ్యాక్టీరియా పెరుగుతుంది కాబట్టి బాటిల్ పొడిగా ఉండేలా చూడాలి. కనీసం వారానికి కొన్నిసార్లు ఈ విధంగా కడగాలి. దుర్వాసన వస్తే బాటిల్‌ను వెంటనే పారేయాలి.

వారానికి ఒకసారి బ్లీచ్ వాడి బాటిల్‌ను కడుగుతారు. బ్రష్‌తో నోటి భాగం, అడుగు భాగం సహా పూర్తిగా శుభ్రం చేసి గాలిలో ఆరనిస్తారు. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం కూడా ముఖ్యం” అని ఆయన సలహా ఇస్తారు.

ఏ బాటిల్ ఉపయోగించాలి?

ప్లాస్టిక్ బాటిళ్లలో స్టీల్ బాటిళ్ల కంటే ఎక్కువ బ్యాక్టీరియా పెరుగుతుందని అధ్యయనాలు చెప్పినప్పటికీ, శుభ్రతే కీలకం. ప్లాస్టిక్‌లో రసాయన సమ్మేళనాలు ఉండటం వల్ల నీటిలో కలిసే ప్రమాదం ఉందని ఖతార్‌లోని వెయిల్ కార్నెల్ మెడిసిన్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అమిత్ అబ్రహం అంటారు. ఇవి గుండె జబ్బులు, హార్మోన్ల సమస్యలు వంటి వ్యాధులకు దారితీయవచ్చు. కాబట్టి గాజు లేదా స్టీల్ బాటిళ్లను ఉపయోగించడం మంచిది. ఏ బాటిల్ ఎంచుకున్నా, దాన్ని శుభ్రంగా ఉంచితేనే నీరు సురక్షితంగా, బ్యాక్టీరియా రహితంగా ఉంటుంది.