Tollywood: ఒక్క సినిమా హిట్ కాలేదు.. కానీ ఆస్తులు రూ.53 వేల కోట్లు.. ఈ హీరోయిన్ బ్యాగ్రౌండ్ తెలిస్తే..
అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే వంటి తారలతో కలిసి పనిచేసింది. ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా అందుకోలేదు. కానీ ఆమె ఆస్తులు మాత్రం రూ.53 వేల కోట్లకు పైనే. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.. ?

బాలీవుడ్‌లో చాలా మంది నటులు తమ కుటుంబాల అడుగుజాడల్లో నడుస్తూ సినిమా ప్రపంచంలోకి ప్రవేశించారు. అది నటన అయినా, సినిమా అయినా, దర్శకత్వం అయినా. సినిమా కుటుంబం నుండి వచ్చిన ఈ నటి అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, ఆ తర్వాత నటన వైపు మళ్లింది. ఆమె కెరీర్ లో ఒక్క హిట్టు కూడా లేదు. కానీ ఆమె ఆస్తులు మాత్రం 53 వేల కోట్లకు పైనే ఉన్నాయి. బాలీవుడ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ నటి, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే వంటి తారలతో కలిసి పనిచేశారు. కెమెరా వెనుక పనిచేసిన తర్వాత వెండితెరపై కనిపించింది. ఇటీవల, ఆమె నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘హిరామండి: ది డైమండ్ బజార్’లో కనిపించింది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, చిత్రనిర్మాత సంజయ్ లీలా భన్సాలీ మేనకోడలు, నటి షర్మిన్ సెహగల్.
సంజయ్ లీలా భన్సాలీతో షర్మిన్ కు ఉన్న సంబంధం గురించి ప్రజలకు తెలుసు. కానీ షర్మిన్ కుటుంబం పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన కుటుంబాలలో ఒకటి. షర్మిన్ తండ్రి దీపక్ సెహగల్ ఒక ఫిల్మ్ ఎగ్జిక్యూటివ్, ఆమె తల్లి బేలా సెహగల్ ఒక ఫిల్మ్ ఎడిటర్. షర్మిన్ తల్లి సంజయ్ లీలా భన్సాలీ చెల్లెలు. షర్మిన్ తాత మోహన్ సెహగల్ కూడా సినీ ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన పేరు. షర్మిన్ సెగల్ తన మామ సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో 2019లో విడుదలైన ‘మలాల’ చిత్రంతో నటనా రంగ ప్రవేశం చేసింది. కానీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం పాలైంది. దీని తర్వాత, ఆమె ‘అతిథి భూతో భవ’లో నటించింది, కానీ ఈ చిత్రం కూడా ప్రేక్షకుల ఆకట్టుకోలేదు. ఇటీవల ‘హీరామండి: ది డైమండ్ బజార్’లో నటించింది. కానీ ఆమె నటనపై భారీగా ట్రోలింగ్ జరిగింది.
షర్మిన్ 2023లో వ్యాపారవేత్త అమన్ మెహతాను వివాహం చేసుకుంది. అతడి ఆస్తులు రూ.53,800 కోట్లు. అమన్ టొరెంట్ గ్రూప్ విభాగం అయిన టొరెంట్ ఫార్మాస్యూటికల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అమన్ మెహతా వ్యాపార దిగ్గజం సమీర్ మెహతా కుమారుడు, అతని సోదరుడి పేరు సుధీర్ మెహతా.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..