AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: పౌర్ణమి సినిమాలో కనిపించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడేం చేస్తుందంటే..

ప్రభాస్ సినిమాలకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. డార్లింగ్ సినిమా వచ్చిందంటే ఫస్ట్ డే రూ.100 కోట్లు కలెక్షన్స్ రావాల్సిందే. ఇటీవలే కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ప్రభాస్. ప్రస్తుతం రాజాసాబ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.

Prabhas: పౌర్ణమి సినిమాలో కనిపించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడేం చేస్తుందంటే..
Madhu Sharma
Rajitha Chanti
|

Updated on: Mar 30, 2025 | 10:45 PM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొన్నాళ్లుగా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక డార్లింగ్ అప్ కమింగ్ మూవీస్ కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం రాజాసాబ్ సినిమాతో బిజీగా ఉన్నాడు డార్లింగ్. ఇదిలా ఉంటే.. డార్లింగ్ కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ పౌర్ణమి. అప్పట్లో ఈ సినిమా మ్యూజికల్ బ్లాక్ బస్టర్. అప్పట్లో ఈ మూవీలోని సాంగ్స్ సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పటికీ ఎక్కడో ఒకచోటు వినిపిస్తూనే ఉంటాయి. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎంఎస్ రాజ్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో త్రిష, ఛార్మీ హీరోయిన్లుగా నటించారు. అయితే హీరోయిన్ సింధు తులానీ కీలకపాత్ర పోషించింది.. ఇదిలా ఉంటే ఈ మూవీలో మరో హీరోయిన్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఆమె పేరు మధు శర్మ. ఇందులో ప్రభాస్ ను ఇష్టపడే వివాహిత మోహని పాత్రలో నటించింది మధు శర్మ.

ముంబై చెందిన మధు శర్మ పౌర్ణమి సినిమా కంటే ముందు హిందీ, మరాఠీ భాషలలో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలలో నటించి పాపులర్ అయ్యింది. తమిళంలో గురు పర్వాయ్ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నార్త్ ఇండియన్ అమ్మడు ఆ తర్వాత తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. విలక్షణ నటుడు జగపతి బాబు హీరోగా నటించిన పాండు చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. అలాగే శివాజీ, లయ హీరోహీరోయిన్లుగా నటించిన అదిరిందయ్యా చంద్రం, శ్లోకం, గౌతమ్ ఎస్ఎస్సీ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించింది. అల్లరి నరేష్, శశాంక్ సరసన పార్టీలో కనిపించింది. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ.. పౌర్ణమి చిత్రంలో మోహిని పాత్రలో నటించింది.

తెలుగులో శ్రీహరి హీరోగా నటించిన హనుమంతు, బ్రహ్మా వంటి చిత్రాల్లో నటించింది. తెలుగులో ఆడపాదడపా చిత్రాల్లో నటించిన మధుశర్మ ఆ తర్వాత టాలీవుడ్ కు దూరమై హిందీలో సీరియల్స్ చేస్తుంది. ఇప్పుడు మధుశర్మ భోజ్ పురిలో సినిమాల్లో నటిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా మధుశర్మ లేటేస్ట్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

View this post on Instagram

A post shared by Madhhu Shharma (@madhhuis)

ఇది చదవండి :  Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..

Tollywood: గ్లామర్ షోతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. వరుస సినిమాలు చేస్తున్న రానీ క్రేజ్.. ఆఫర్స్ కోసం..

Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..

Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..

Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..

ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా