Swati Sachdeva: ‘వైబ్రేటర్’తో తల్లికి దొరికిపోయానంటూ వల్గర్ కామెంట్స్.. ఇది కామెడీనా స్వాతి
- స్టాండప్ కామెడీ పేరుతో నోటికొచ్చిన చెత్తంతా వాగుతున్నారు. మిలియన్ల కొద్దీ వ్యూస్ కోసం, వేల కొద్దీ లైక్స్ కోసం శ్రుతిమించిన అశ్లీలాన్ని జనం మెదళ్లలో జొప్పిస్తూ... సమాజానికి చెద పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. యూట్యూబర్ రణవీర్ అల్హాబాడియా పైత్యంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమైనా... కోర్టులు సైతం కన్నెర్ర చేసినా కొందరి తీరు ఏమాత్రం మారట్లేదు. మొన్న కుణాల్ కామ్రా... లేటెస్ట్‌గా స్వాతి సత్యదేవా మరోసారి చెత్తవాగుడుతో తీవ్ర విమర్శల పాలవుతున్నారు.

నోటికొచ్చినది వాగితే… చేతికొచ్చింది రాస్తే…. తప్పదు భారీమూల్యం అన్న హెచ్చరికలు సభ్యసమాజం నుంచి వస్తున్నాయి. అంతేకాదు చట్టప్రకారం శిక్షలు పడేదాకా తీసుకెళ్తున్నాయి. అయినా కొంతమంది ఏమాత్రం తగ్గట్లేదు. లేటెస్ట్‌గా స్టాండప్ కమెడియన్ స్వాతి సత్యదేవ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. బెడ్ రూమ్ డోర్లను సైతం బద్దులు కొట్టుకుని.. అక్కడ కూర్చుని మరీ కామెడీ చేసే ప్రయత్నం చేసింది. సెక్స్ టాయ్‌తో తల్లికి దొరికిపోయానంటూ… రాయడానికి, చదవడానికే ఇబ్బందికరంగా ఉన్న ఎబ్బెట్టూ కామెడీతో కాంట్రవర్సీ కొని తెచ్చుకుంది.
ఇప్పుడీ వ్యాఖ్యలే తీవ్రదుమారం రేపుతున్నాయి. స్వాతి కామెడీపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అత్యంత భయంకరమైన కామెడీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. నవ్వించడానికి ఇంతలా దిగజారాలా అని ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు… ఫేమ్ కోసం పేరెంట్స్‌ని ఇంతలా అవమానించడం దారుణమని మండిపడుతున్నారు.
అంతకుముందు మరో స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రా కూడా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కాడు. ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేతో మొదలుకొని… ఆనంద్ మహేంద్రా వరకూ అందరిని తన స్టాండప్ కామెడీకి వాడుకున్నాడు. షిండేపై పేరడీ పాట రాస్తే… ఇన్‌ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, ప్రముఖ రచయిత్రి సుధామూర్తి మధ్యతరగతి మనిషిగా నడుస్తోందని సెటైర్లే వేశాడు. అలాగే సొంత కార్లను మెరుగుపరుచుకోవడం తప్ప… అన్ని విషయాలపై మాట్లాడతారంటూ ఆనంద్‌మహేంద్రపైనా కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారు కామ్రా. ఫలితంగా అతనిపై నమోదైన కేసుల విషయంలో అరెస్ట్ చెయ్యొద్దంటూ కోర్టుల నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్నాడు.
అలాగే ఆ మధ్య రణ్‌వీర్ అల్హాబాదియా చేసిన రచ్చ సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసేదాకా వెళ్లింది. తన పాడ్ కాస్ట్‌లో తల్లిదండ్రుల శృంగారంపై విపరీత ప్రశ్నలు వేసి.. చట్టపరంగా చిక్కులు కొని తెచ్చుకున్నాడు. అసోం, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లోనూ రణ్‌వీర్‌పై ఎఫ్‌ఐఆర్‌లు ఫైల్ అయ్యాయి. ఫైనల్‌గా సుప్రీంకోర్టు ఆదేశాలతో రణ్‌వీర్ షోకి బ్రేక్ పడింది.
మొత్తంగా… హద్దు దాటుతున్న యూట్యూబర్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్స్ ఎక్కువవుతున్నాయి. లైన్ క్రాస్ చేయాలంటే వణుకుపుట్టించేలా చేయాలంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..