ఓరీ దేవుడో.. 66ఏళ్ల వయసులో 10వ బిడ్డకు జన్మనిచ్చిన వృద్ధురాలు..తల్లీ బిడ్డ క్షేమం.. ఎలా సాధ్యం..?
ఇదిలా ఉంటే, 50 ఏళ్లు పైబడిన మహిళలు అకాల మరణం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, గతంలో జరిగిన సిజేరియన్ నుండి వచ్చే అనేక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనా యువతులు కూడా పిల్లలు పుట్టని యుగంలో మనం జీవిస్తున్నప్పుడు, మనవరాళ్లతో ఆడుకోవాల్సిన వయస్సులో ఈ మహిళ తన 10వ బిడ్డకు జన్మనివ్వడం మామూలు విషయం కాదని చెబుతున్నారు.

25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న ఆడవాళ్లు కూడా సహజంగా పిల్లలను కనలేని యుగంలో మనం జీవిస్తున్నాం. ఎవరిని అడిగినా సరే.. చాలా మంది అమ్మాయిలు PCOD, PCOS వంటి రుతుక్రమ సమస్యలతో బాధపడుతున్నామని చెబుతారు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు సహజంగా పిల్లలు పుట్టడం కొంచెం కష్టమవుతుంది. ఈ కారణంగా చాలా మంది వివిధ రకాల చికిత్సలు తీసుకోవాల్సి వస్తుంది. దీంతో IVF, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ వంటి చికిత్సలు వరంగా మారాయి. దీంతో సంబంధిత వైద్యులు కూడా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మహిళ 66ఏళ్ల వయసులో ఎలాంటి IVF టెక్నాలజీ సహాయం లేకుండానే బిడ్డకు జన్మనిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే 66 ఏళ్ల వయసులో ఆమెకు పుట్టిన బిడ్డ 10వ సంతానం.
66 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిన ఆ మహిళ పేరు అలెగ్జాండ్రా హిల్డెబ్రాండ్. జర్మన్ మూలానికి చెందిన ఈ మహిళ మార్చి 10న బెర్లిన్‌లో తన10వ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె గర్భధారణ కారణంగా కాన్పు సమయంలో ప్రమాదం ఉన్నప్పటికీ, ఆమె ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆమె కుటుంబ సభ్యుల మద్దతు ఆమెకు సజావుగా ప్రసవం కావడానికి సహాయపడ్డాయి. ఆమె బెర్లిన్‌లోని చారిటే ఆసుపత్రిలో ఫిలిప్ అనే అబ్బాయికి జన్మనిచ్చింది. ఆ బిడ్డ బరువు 3 కిలోగ్రాముల 175 గ్రాములు (7 పౌండ్ల 13 ఔన్సులు), కాబట్టి ఫిలిప్ సి-సెక్షన్ ద్వారా జన్మించాడు.
ప్రస్తుతం 66 ఏళ్ల వయసున్న అలెగ్జాండ్రా హిల్డెబ్రాండ్‌కు ఇప్పటికే 2 నుండి 46 సంవత్సరాల వయసుగల 9 మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు జన్మించిన ఫిలిప్‌కు 46 సంవత్సరాల పెద్ద తోబుట్టువులు ఉన్నారు. వృద్ధాప్యంలో బిడ్డకు జన్మనిచ్చిన అలెగ్జాండ్రా హిల్డెబ్రాండ్ సాధారణ మహిళ కాదు..డైనమిక్ లేడి అని చెప్పాలి. ఆమె బెర్లిన్‌లోని చెక్‌పాయింట్ చార్లీలో ఉన్న వాల్ మ్యూజియం మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్నారు.
10వ బిడ్డకు జన్మనిచ్చిన సందర్బంగా అలెగ్జాండ్రా మాట్లాడుతూ..బేబీ ఫిలిప్ గర్భధారణ సమయంలో తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని చెప్పారు. అంతా ప్రణాళిక ప్రకారం జరిగిందని అలెగ్జాండ్రా హిల్డెబ్రాండ్ట్ అన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని గడపడం వల్ల వృద్ధాప్యంలో కూడా నేను ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటాను. నేను చాలా ఆరోగ్యంగా తింటాను, క్రమం తప్పకుండా గంటసేపు ఈత కొడతాను, రెండు గంటలు నడుస్తాను అని ఆమె చెప్పింది. ఈ అలవాట్ల వల్లే తన ఆరోగ్యం క్షేమంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లోనే ఆరోగ్యకరమైన గర్భధారణకు కారణంగా వైద్య నిపుణులు చెప్పారు.
ఇదిలా ఉంటే, 50 ఏళ్లు పైబడిన మహిళలు అకాల మరణం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, గతంలో జరిగిన సిజేరియన్ నుండి వచ్చే అనేక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనా యువతులు కూడా పిల్లలు పుట్టని యుగంలో మనం జీవిస్తున్నప్పుడు, మనవరాళ్లతో ఆడుకోవాల్సిన వయస్సులో ఈ మహిళ తన 10వ బిడ్డకు జన్మనివ్వడం మామూలు విషయం కాదని చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




