మందార పూలతో రెట్టింపు అందం.. ఇలా వాడితే పట్టులాంటి మెరిసే చర్మం మీ సొంతం..!
సాధారణంగా ప్రతి మహిళ తన ముఖం చాలా అందంగా కనిపించాలని కోరుకుంటుంది. దీనికోసం తరచుగా బ్యూటీ పార్లర్లకు వెళ్తుంటారు. ఖరీదైన క్రీములు, లోషన్లు అంటూ వేలకు వేలు ఖర్చుపెడుతుంటారు. మార్కెట్లో లభించే అనేక కెమికల్ ఆధారిత ఉత్పత్తులను కొనుగోలు చేసి ముఖాలకు రాసుకుంటారు. అయితే వీటితో డబ్బు వృధా అవుతుంది. పైగా ఇలాంటి వాటితో సైడ్‌ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయని బ్యూటీషన్లు చెబుతున్నారు. కానీ, మెరిసే అందం కోసం మందార పువ్వు ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. అదేలాగో చూద్దాంపదండి..
Updated on: Mar 30, 2025 | 4:34 PM

మందార పువ్వు చర్మంపై ఉన్న మొటిమలు, జిడ్డును తొలగించి చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. వృద్ధాప్య ఛాయలను తగ్గించి, స్కిన్‌ను హైడ్రేట్‌గా ఉంచుతుంది. మందార పువ్వులతో తయారు చేసిన ఈ ఫేస్ ప్యాక్ కేవలం ఒక వారంలోనే ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుందని అంటున్నారు.

ఇందుకోసం తాజాగా కోసిన 10 మందార పువ్వులను తీసుకోవాలి. ఒక పాత్రలో అర లీటరు నీరు పోసి మరిగించాలి. నీరు వేడెక్కిన తర్వాత అందులో మందార పూలను వేయాలి. దీంతో మందార పువ్వు జెల్ రూపంలోకి మారుతుంది. ఇప్పుడా జెల్‌ని చల్లార్చి స్టోర్ చేసుకోవాలి. ఆ జెల్‌తో ముఖానికి సున్నితంగా మసాజ్ చేయాలి. ముఖానికి మాత్రమే కాకుండా చేతులు, కాళ్ళు, మెడకు కూడా అప్లై చేయవచ్చు.

20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై మీ ముఖాన్ని చల్లటి నీటితో వాష్ చేసుకోవాలి.. ఇలా చేయడం వల్ల మీ ముఖంలోని మురికి, మచ్చలు, నల్లటి మచ్చలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. క్రమంగా ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. స్నానానికి ముందు ఒక వారం రోజులపాటు ఇలా చేస్తూ ఉంటే.. ఏడు రోజుల్లో మీ ముఖం కాంతివంతంగా మారుతుంది.

మందార పూలతో స్క్రబ్ తయారీ కోసం మందార పువ్వులను ఎండబెట్టి పొడి చేసి, మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో 1 టీస్పూన్ పెరుగు, అర టీస్పూన్ రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా చేసుకొని ముఖంపై రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత నీటితో కడగాలి. దీంతో చర్మం మెరుస్తుంది.

రెండు లేదా మూడు మందార పువ్వులను నీటిలో 1-2 గంటలు నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ మొక్కజొన్న పిండి, కొంచెం తేనె వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో నానబెట్టి ఉంచిన మందార నీళ్లను కూడా పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పడి మిశ్రమాన్ని ఐస్ క్యూబ్ ప్లేట్‌లో వేసుకొని ఫ్రీడ్జ్‌లో పెట్టుకోవాలి. ఈ ఐస్ క్యూబ్స్‌తో ప్రతీ రోజూ ఖంపై ఆప్లై చేయండం వల్ల మీ ముఖం గ్లో అవుతుంది. ఇది ముఖంపై ఉన్న మొటిమలు కూడా తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి.

మందారం- అలోవెరా జెల్‌తో చక్కటి ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని వాడితే..అద్భుతంగా పనిచేస్తుంది. ఇందుకోసం రెండు మందార పువ్వులను మెత్తగా గ్రైండ్ చేసుకొని, అందులో కలబంద జెల్‌ను కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.





























