Tollywood: అప్పుడు ఫుడ్ సర్వర్.. ఇప్పుడు ఇండస్ట్రీ సెన్సేషన్.. ఎవరీ హీరోయిన్..
సినీరంగుల ప్రపంచంలోహీరోహీరోయిన్లుగా ఎదగడం అంటే మాములు విషయం కాదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే తారలు చాలా మంది ఉన్నారు. ఎన్నో కష్టాలు.. సవాళ్లు, అవమానాలను ఎదుర్కొని ఫారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న తారల గురించి చెప్పక్కర్లేదు.

సినీ పరిశ్రమలో ఒకప్పుడు ఆమె సెన్సేషన్. స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్. కానీ కొన్నాళ్లుగా నిత్యం వివాదాలతో వార్తలలో నిలుస్తుంది. దీంతో సినిమాలకు సైతం దూరమయ్యింది. ప్రస్తుతం దేశం విడిచి ఎక్కుడో విదేశాల్లో జీవిస్తుంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో సంచలన హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకున్న ఓ అమ్మాయి.. కెరీర్ తొలినాళ్లలో పెళ్లి వేడుకలలో ఫుడ్ సర్వర్ గా పనిచేసింది. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టనష్టాలు చవిచూసిన ఈ భామ ఇండస్ట్రీలో చాలా పాపులర్ అయ్యింది. కానీ ప్రేమ, పెళ్లి ఆమ జీవితంలో కలిసి రాలేదు. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ రాకీ సావంత్. బాలీవుడ్ చిత్రసీమలో స్పెషల్ పాటలతో గుర్తింపు తెచ్చుకున్న నటి.
రాకీ సావంత్.. ఎక్కువగా సినిమాలు.. అటు వ్యక్తిగత జీవితంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. స్పెషల్ పాటలకు డ్యాన్స్ చేయడం ద్వారా మరింత ఫేమస్ అయ్యింది. 1978 నవంబర్ 25న ముంబైలో జన్మించిన రాఖీ సావంత్ అసలు పేరు నెహ్రూ బేడా. తండ్రి వర్లీలో కానిస్టేబుల్. రాకీ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు చూసిందట.. ఈ విషయాన్ని స్వయంగా తనే అనేక ఇంటర్వ్యూలు, షోలలో ప్రస్తావించారు. 10 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నానని.. ముంబయిలోని ఓ క్యాటరింగ్ సర్వీస్‌లో ఫుడ్ సర్వర్ గా వర్క్ చేసినట్లు తెలిపింది.. అప్పుడు తనకు రోజుకు రూ.50 వేతనం జీతం ఇచ్చేవారని చెప్పుకొచ్చింది.
సినీరంగంలోకి రావడం తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని… కానీ తనకు మాత్రం చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేదని.. అందుకే ఇంట్లో వాళ్లను కాదని సినిమాల్లోకి అడుగుపెట్టానని తెలిపింది. కాలేజీ చదువు పూర్తయ్యాక సినిమాల్లో నటించాలనే తపనతో ఉన్న రాకీకి నిరాశే మిగిలింది. ఆమె రంగు తక్కువగా ఉండడంతో సినిమాల్లో అవకాశాలు రాలేదు. ఆ తర్వాత ఆమె తన శరీరం, ముఖానికి శస్త్రచికిత్స చేయించుకుంది. చికిత్స తర్వాత రాకీకి సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. “అగ్ని చక్రం” సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది రాకీ.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..