వామ్మో ఇదెక్కడి వింత.. తలలేని కోడి ఏకంగా 18 నెలలు బతికింది..! మైక్ మాయాజాలం తెలిస్తే..
ఏ మానవుడు లేదా జంతువు కూడా తల లేకుండా జీవించలేడు. కానీ అలాంటి అద్భుతం దాదాపు 80 ఏళ్ల క్రితం జరిగింది. వినడానికి ఇది వింతగా అనిపించవచ్చు. కానీ ఇది నిజం. ఒక కోడి 18 నెలలు తల లేకుండా జీవించి చరిత్ర సృష్టించింది. ఈ ప్రత్యేకమైన కోడి పేరు 'మైక్'. ప్రజలు దీనిని 'తలలేని కోడి' అని పిలుస్తారు. ఈ వార్త అన్ని వార్త పత్రికల్లోనూ ప్రచురించారు. దీంతో మైక్ కథ దావానలంలా వ్యాపించింది

అమెరికాలోని కొలరాడో నివాసితులు లాయిడ్ ఓల్సన్, అతని భార్య క్లారా ఒక చికెన్ దుకాణం నిర్వహించేవారు. వాళ్ళు ప్రతిరోజూ వందలాది కోళ్లను చంపి వాటి మాంసాన్ని అమ్ముకునేవారు.. ఈ క్రమంలోనే ఒక రోజు లాయిడ్ ఒక కోడి తలను కట్ చేశాడు. విచిత్రంగా అది చనిపోలేదు. పైగా అలానే నడవడం ప్రారంభించిందట. . ఈ దృశ్యాన్ని చూసి ఓల్సన్ కుటుంబం షాక్ అయ్యింది. దాంతో ఓల్సన్ మైక్ ఆ తలలేని కోడిని జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించాడు. ఆ కోడికి గొంతులోని ట్యూబ్ ద్వారా నీరు, ఆహారం తినిపించేవారట.. మైక్ శ్వాసనాళంలో పేరుకుపోయిన శ్లేష్మాన్ని తొలగించడానికి ఒక సిరంజిని ఉపయోగించేవారట. మైక్ చేసిన అద్భుతం గురించి చుట్టుపక్కల ప్రజలకు తెలిసింది. దాంతో అప్పట్లో ఈ వార్త అన్ని వార్త పత్రికల్లోనూ ప్రచురించారు. మైక్ కథ దావానలంలా వ్యాపించింది.
తలలేని కోడి వార్త వైరల్‌గా మారటంతో ఈ కోడిని చూసేందుకు చాలా దూరం నుండి ప్రజలు రావడం ప్రారంభించారు. అలా ఈ ప్రత్యేకమైన కోడి ఓల్సన్ కుటుంబానికి డబ్బు సంపాదించిపెట్టేందుకు ఒక మార్గంగా మారింది.. అది వారి జీవితాలను మార్చేసింది.. 1947 ఏప్రిల్‌లో ఒక రాత్రి, మైక్ అరిజోనాలోని ఫీనిక్స్ టూర్‌కి వెళ్లినప్పుడు..ఆ కోడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైందట. ఆ సమయంలో ఓల్సన్ కుటుంబ సభ్యుల వద్ద సిరంజి లేదు.. చుట్టుపక్కల ఎంత వెతికినా సిరంజి దొరకలేదు. దాంతో కఫం పేరుకుపోవడం వల్ల ఊపిరాడక మైక్ మరణించింది. ఓల్సన్ ఈ విషయాన్ని చాలా సంవత్సరాలు రహస్యంగా ఉంచాడు. తాను తన మైక్‌ని వేరొకరికి అమ్మేశానని చెప్పాడు. కానీ ఆ తర్వాత నిజం బయటపడింది.

Headless Chicken
మైక్ జ్ఞాపకార్థం కొలరాడోలోని ఫ్రూయిటా పట్టణంలో ప్రతి సంవత్సరం ‘మైక్ ది హెడ్‌లెస్ చికెన్ ఫెస్టివల్’ జరుపుకుంటారు. శాస్త్రవేత్తల ప్రకారం, కోడి మెదడు వెనుక భాగంలో ఉంటుంది. ఓల్సన్ మైక్ తల కట్ చేసినప్పుడు దాని మెదడు, గొంతులో కొంత భాగం చెక్కుచెదరకుండా ఉండిపోవటంతో ఆ కోడి బతికి బయటపడిందని చెప్పారు.. అదృష్టవశాత్తూ, రక్త ప్రవాహం కూడా త్వరగా ఆగిపోయింది. కాబట్టి అధిక రక్తస్రావం వల్ల ఆ కోడి చనిపోలేదని చెప్పారు. అయితే, ఇప్పుడు తాజాగా ఈ వార్త మరోమారు వైరల్ గా మారి చక్కర్లు కొడుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..