Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Rains: ఏపీలో వచ్చే 3 రోజులు వెదర్ రిపోర్ట్ ఇలా.. వర్షాలు పడే ప్రాంతాలివే

ఏపీలో వాతావరణం ఎలా ఉండబోతోంది. వచ్చే 3 రోజులు వాతావరణ సూచనలు ఇచ్చింది విపత్తుల నిర్వహణ సంస్థ. వచ్చే 3 రోజుల్లో ఈ ప్రాంతాల్లో వడగాలులు ఉండనున్నాయి. మరి ఆ సూచనలు ఏంటో ఇప్పుడు ఈ వార్తలో తెలుసుకుందామా మరి. ఓసారి లుక్కేయండి.

AP Rains: ఏపీలో వచ్చే 3 రోజులు వెదర్ రిపోర్ట్ ఇలా.. వర్షాలు పడే ప్రాంతాలివే
Ap Weather
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 27, 2025 | 1:55 PM

దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న నిన్నటి ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు ఉత్తర మధ్య మహారాష్ట్ర నుండి ఉత్తర కేరళ వరకు అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. దిగువ ట్రోపో ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ & యానాంలలో దక్షిణ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి.

ఇది చదవండి: దేవుడు కలలో కనిపించి పొలంలో తవ్వమన్నాడు.. తీరా తవ్వి చూడగా

—————————————-

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :

———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

ఈరోజు:- —————

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కి.మీ.వేగం తో వీచే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

రేపు:- —————————

పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 3 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది. వేడి, తేమతో కూడిన వాతావరణం ఉండే అవకాశముంది

ఎల్లుండి:- ——————-

పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 3 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది. వేడి, తేమతో కూడిన వాతావరణం ఉండే అవకాశముంది.

ఇది చదవండి: పెళ్లి, ఆపై ఫస్ట్‌నైట్.. మూడో రోజే వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. అతడేం చేశాడంటే

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:- ————————————-

ఈరోజు:-

పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది.

రేపు, ఎల్లుండి:-

పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 3 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది. వేడి, తేమతో కూడిన వాతావరణం ఉండే అవకాశముంది.

రాయలసీమ:- ———————————–

ఈరోజు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది.

రేపు, ఎల్లుండి:-

పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 3 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

ఇది చదవండి: కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు.. ఆపి చెక్ చేయగా

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..