రాను.. రాను.. కుదరదయ్యో అంటూ సన్ సైడ్ ఎక్కిన మహిళ.. ఎందుకే తెలిస్తే అవాక్కే!
భార్యాభర్తల మధ్య అనుబంధం అంటే ఆప్యాయత- ప్రేమానురాగం కామన్..! అప్పుడప్పుడు చిన్నచిన్న గొడవలు లేకపోతే అది జీవితమే కాదు అంటారు పెద్దలు. అవును నిజమే.. ప్రతి ఇంట్లో దంపతుల మధ్య ఇవన్నీ కలిసే ఉంటాయి. దాన్నే జీవితం అంటారు. కొన్నిసార్లు అయితే చిన్న చిన్న విషయాలకే భార్య, భర్త పైన.. భర్త భార్య పైన అలుగుతూ ఉంటారు. కానీ విశాఖలో భర్తపై అలిగిన ఓ భార్య.. ఏం చేసిందో తెలుసా..? ఆమె చేసిన పనికి పోలీసుల తల ప్రాణం తోక కొచ్చింది..!

విశాఖపట్నం పీఎం పాలెం వైఎస్సార్ కాలనీలో సూరి అనే మహిళ హంగామా సృష్టించింది. భర్తపై అలిగి మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. భవనంపైకెక్కి కిటికీ సన్ సైట్‌పై దిగి కూర్చుంది. ఎంతకీ కిందకు రానంటూ మారం చేసింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. పైకి రావాలని కోరారు. అయినా వినకుండా.. దూకేస్తానని బెదిరిస్తూ మొండికేసింది. దీంతో అతి కష్టం మీద ఆ మహిళను బుజ్జగించిన ఎస్సై భాస్కర్.. సురక్షితంగా కాపాడారు.
సాహసమే చేసిన ఎస్సై..
కిటికీ సన్ సైడ్‌పై సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తూ కూర్చున్న ఆ మహిళను రక్షించేందుకు పోలీసులకు తల ప్రాణం తోకకొచ్చింది. చేయి పట్టుకుని పైకి లాగేందుకు ప్రయత్నించారు. మహిళ బెదరింపులతో మహిళా కానిస్టేబుల్స్ వెళ్లే సాహసం చేయలేదు. మరోవైపు సన్ సైడ్ వరకు దిగాలంటే లేడీ కానిస్టేబుల్స్‌కు కష్టమైన పని. అలస్యం చేస్తే, చేయి దాటిపోయే ప్రమాదం అని తెలిసిన ఎస్ఐ భాస్కర్.. తానే స్వయంగా రంగంలోకి దిగిపోయారు. ఆమెను రెస్క్యూ చేసేందుకు సాహసమే చేశారు. తన వెనుక రెండు కాళ్లు పట్టుకోమని చెప్పి.. సిబ్బంది స్థానికుల సహకారంతో సన్ సైట్ వరకు బయటకు దిగారు ఎస్సై. మెల్లగా సూరి చెయ్యిని పట్టుకున్నారు. తాను పైకి వచ్చేదే లేదని చెప్పినా.. రెండు చేతులు పట్టుకుని పైకి లాగి రెస్క్యూ చేశారు ఎస్ఐ భాస్కర్.
విషయం తెలసి అందరూ షాక్..!
అసలు ఆ మహిళ ఎందుకలా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందని పోలీసులు ఆరా తీశారు. దీంతో అందరూ ముక్కున వేలు వేసుకునే పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే.. 500 రూపాయల కోసం ఆ మహిళ అలా చేసిందట. భర్త వెంకటరమణ 500 రూపాయలు తనకు ఇవ్వలేదని మనస్థాపం చెందింది సూరి. ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టడమే కాకుండా.. తనకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా కూతురికి ఇచ్చేస్తున్నాడనేది ఆమె ఆవేదన. ఇంత చిన్నదానికే సూరి ఆత్మహత్యకు ప్రయత్నించిందని పీఎం పాలెం ఎస్సై భాస్కర్ తెలిపారు. చివరకు సూరిని సురక్షితంగా రెస్క్యు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..