Visakhapatnam: వార్నీ.. స్మశాన వాటికలో దొంగలు పడ్డారు.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
అది విశాఖపట్నం మహానగరంలోని స్మశాన వాటిక. రోజు మాదిరిగానే స్మశాన వాటిక కాపరి కూడా ఆరోజు వెళ్ళాడు. ఇంతలో ఆ గ్రామంలో ఒక చావు జరగడంతో మృతదేహాన్ని తీసుకొచ్చారు బంధువులు. దహనం చేసేందుకు సిద్ధమయ్యారు. కర్రలను తీసుకుని బర్నింగ్ యూనిట్ వద్దకు వెళ్లారు. దీంతో అంతా షాక్..!

అది విశాఖపట్నం మహానగరంలోని స్మశాన వాటిక. రోజు మాదిరిగానే స్మశాన వాటిక కాపరి కూడా ఆరోజు వెళ్ళాడు. ఇంతలో ఆ గ్రామంలో ఒక చావు జరగడంతో మృతదేహాన్ని తీసుకొచ్చారు బంధువులు. దహనం చేసేందుకు సిద్ధమయ్యారు. కర్రలను తీసుకుని బర్నింగ్ యూనిట్ వద్దకు వెళ్లారు. దీంతో అంతా షాక్..! ఎందుకంటే.. ఆ యూనిట్‌కు ఉండే ఐరన్ ఫ్రేములు కనిపించలేదు. ఆరా తీస్తే అంతా ముఖాలు చూసుకున్నారు. చివరికి దొంగలు పడ్డారని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు.
వివరాల్లోకి వెళితే.. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని మింది గ్రామం. అక్కడ స్మశాన వాటికలో ఈ మధ్యకాలంలో 50 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేశారు. రెండు బర్నింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి అందుబాటులోకి తెచ్చారు. మంది కాలనీలో బుధవారం(మార్చి 26) నాడు ఒక వ్యక్తి మృతి చెందాడు. దహన సంస్కారాలు చేసేందుకు.. కుటుంబ సభ్యులు స్థానికులు మృతదేహాన్ని స్మశాన వాటికకు తీసుకెళ్లారు. అయితే అక్కడ.. రెండు బర్నింగ్ యూనిట్లకు ఉండే ఐరన్ ఫ్రేమ్‌లు, కొన్ని ఇనుప రాడ్లు లేకపోవడం చూసి కంగుతిన్నారు.
చివరకు చోరీకి గురయ్యాయని నిర్ధారణకు వచ్చారు. మృతదేహానికి ఎలాగోలా అంతిమ సంస్కారాలు చేశారు. ఆ తర్వాత దీన్ని తీవ్రంగా పరిగణించిన గ్రామస్తులు పోలీసులను ఆశ్రయించారు. గాజువాక పోలీస్ స్టేషన్‌లో ఈటి సురేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకుని పోలీసులు సైతం అవాక్కవక తప్పలేదు. కాగా, ఈ వ్యవహారానికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..