Heroine: బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో తెలుగు హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ఇక ఆపడం కష్టమే..
తెలుగులో ఇప్పుడిప్పుడే క్రేజ్ సంపాదించుకుంటున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ వయ్యారి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ కొట్టేసింది. దీంతో ఈ బ్యూటీకి అటు తమిళంలోనూ వరుస ఆఫర్స్ ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఆమె ఎవరంటే..

సినీరంగంలోకి ఇప్పుడిప్పుడే వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంటుంది ఈ హీరోయిన్. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే నటనపై ఆసక్తితో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఈ బ్యూటీ నటించిన సినిమాలు అంతగా మెప్పించకపోవడంతో ఈ అమ్మడుకు ఆశించిన స్థాయిలో బ్రేక్ రాలేదు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే యాక్సిడెంట్ కారణంగా సినిమాలకు దూరమైన ఈ వయ్యారి.. కొన్నాళ్లు సినిమాలకు దూరమయ్యింది. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. హీరోయిన్ నభా నటేష్. ప్రస్తుతం యంగ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న స్వయంభు చిత్రంలో నటిస్తుంది. ఇందులో సంయుక్త మీనన్ సైతం కథానాయికగా నటిస్తుంది.
తాజాగా నభా నటేష్ కు క్రేజీ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో జాట్ అనే సినిమా రూపొందుతుంది.పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ సినిమాగా వస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా.. ఇందులో రెజీనా కసాండ్రా కీలకపాత్రలో కనిపించనుంది. ఏప్రిల్ 10న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని.. అందులో యంగ్ బ్యూటీ నభా నటేష్ కనిపించనుందని టాక్ నడుస్తోంది.
హైదరాబాద్ లో ప్రత్యేకంగా సిద్ధం చేసిన భారీ సెట్ లో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతున్నట్లు టాక్. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇదే నిజమైతే ఇటు తెలుగులోనే కాకుండా అటు హిందీలోనూ నభా నటేష్ కు వరుస ఆఫర్స్ రావడం ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..




