AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajendra Prasad : రమాప్రభకు రాజేంద్ర ప్రసాద్ ఏమవుతాడో తెలుసా? ఇద్దరి మధ్య అంత దగ్గరి బంధుత్వముందా?

రమా ప్రభ, రాజేంద్ర ప్రసాద్.. ఇద్దరూ దిగ్గజ నటులే. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రమా ప్రభ వందలాది సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా ఇప్పటికీ నటిస్తూనే ఉన్నాడు. అయితే వీరిద్దరు దగ్గరి బంధువులనే విషయం చాలా మందికి తెలియదు.

Rajendra Prasad : రమాప్రభకు రాజేంద్ర ప్రసాద్ ఏమవుతాడో తెలుసా? ఇద్దరి మధ్య అంత దగ్గరి బంధుత్వముందా?
Rama Prabha, Rajendra Prasad
Basha Shek
|

Updated on: Mar 27, 2025 | 5:30 PM

Share

సీనియర్ నటీమణి రమా ప్రభ గురించి తెలుగు ఆడియెన్స కు పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ గానూ నటించిన ఈ అందాల తార ఆ తర్వాత లేడీ కమెడియన్ గా తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజ నటీనటులతో కలిసి నటించిన ఘనత రమా ప్రభ సొంతం. ఇక శరత్ బాబుతో పెళ్ళి, విడాకులు రమా ప్రభ జీవితాన్ని మరో మలుపు తిప్పాయి. ఆ మధ్యన ఈ సీనియర్ నటి ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులపై పలు రకాల పుకార్లు తెర మీదకు వచ్చాయి. అయితే అవన్నీ అబద్ధాలేనని తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా తన సోదరుడి కుటుంబంతో కలిసి ఉంటోందీ సీనియర్ నటి.

చెల్లెలి కూతురిని దత్తత తీసుకుని, పెంచి, పెళ్లి చేసి..

ఇక రాజేంద్ర ప్రసాద్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇప్పటికీ సపోర్టింగ్ రోల్స్ తో ఆడియెన్స్ ను మెప్పిస్తున్నాడు. ఈ మధ్యన వివాదాస్పద వ్యాఖ్యలతోనూ వార్తల్లో నిలుస్తున్నాడు నట కిరిటీ. ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్, రమా ప్రభల మధ్య ఉన్న బంధుత్వం గురించి చాలా మందికి తెలియదు. రమా ప్రభకు వరుసకు అల్లుడు అవుతాడు రాజేంద్ర ప్రసాద్. అసలు పిల్లలే లేని రమా ప్రభాకు రాజేంద్ర ప్రసాద్ అల్లుడు ఎలా అయ్యాడని అనుకోవచ్చు. రమా ప్రభ తన చెల్లెలి కూతురిని దత్తత తీసుకుంది. తనే పెంచి పెద్దది చేసింది. ఆ తర్వాత తనే దగ్గరుండి రాజేంద్ర ప్రసాద్‌ తో తన కూతురి పెళ్లి కూడా చేసింది. అలా రమా ప్రభకు రాజేంద్ర ప్రసాద్ అల్లుడయ్యాడు. దగ్గరి బంధుత్వం ఉండబట్టే తరచూ హైదరాబాద్ లోని రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వస్తుంటుంది రమా ప్రభ.ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా అప్పుడప్పుడు రమా ప్రభ ఇంటికి వెళుతుంటాడు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా రమాప్రభ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ లో చూడవచ్చు.

రమా ప్రభ ప్రయాణం..

‘రమా ప్రభ ప్రయాణం’ పేరుతో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను తన యూట్యూబ్ ఛానెల్ లో వీడియోలను అప్ లోడ్ చేస్తోంది రమా ప్రభ. వీటికి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుంటుంది.

ఇవి కూడా చదవండి

రమా ప్రభ పుట్టిన రోజు వేడుకల్లో రాజేంద్ర ప్రసాద్.. వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే