AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళలకు మరింత రక్షణ..షీ టీమ్స్‌లో ప్రత్యేక బృందాలు

మహిళల రక్షణ కోసం తెలంగాణ పోలీసుశాఖ మరింత పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. మహిళా రక్షణలో భాగంగా ఇప్పటికే ప్రత్యేకించి షీ టీమ్స్‌ని ఏర్పాటు చేసిన పోలీసు శాఖ..తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. షీ టీమ్స్‌ని మరింత విస్తృత పరుస్తూ...

మహిళలకు మరింత రక్షణ..షీ టీమ్స్‌లో ప్రత్యేక బృందాలు
Jyothi Gadda
| Edited By: |

Updated on: Jul 22, 2020 | 2:16 PM

Share

మహిళల రక్షణ కోసం తెలంగాణ పోలీసుశాఖ మరింత పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. మహిళా రక్షణలో భాగంగా ఇప్పటికే ప్రత్యేకించి షీ టీమ్స్‌ని ఏర్పాటు చేసిన పోలీసు శాఖ..తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. షీ టీమ్స్‌ని మరింత విస్తృత పరుస్తూ…ఆడవారికి మరింత రక్షణ కల్పించాలనే లక్ష్యంతో సైబరాబాద్ పోలీసులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. అత్యవసర పరిస్థితుల్లో కాల్ వస్తే..నిమిషాల్లో అక్కడికి చేరుకునేలా ’షీ టీమ్స్ డయల్ 100’ పేరిట ప్రత్యేక బృందాలను రంగంలోకి దించనున్నారు.

హెడ్ కానిస్టేబుల్ నేతృత్వంలో ఈ ‘షీ టీమ్స్ డయల్ 100’ బృందాలు పనిచేస్తాయి. ఒక్కో బృందంలో ఓ మహిళా కానిస్టేబుల్‌తో పాటు ముగ్గురు సిబ్బందిని నియమించనున్నారు. వీరికి మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు, ఇతర అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. మహిళల నుంచి కంట్రోల్ రూంకు ఫిర్యాదు రాగానే ఈ బృందాన్ని అలర్ట్ చేస్తారు. అప్పుడు వెంటనే షీ టీమ్స్ డయల్ 100 టీమ్స్‌ని ఘటనా స్థలానికి పంపుతారు. వారు అక్కడికక్కడే సమస్యపై కౌన్సెలింగ్ ఇస్తారు. పరిస్థితి చేయిదాటి పోయేలా ఉంటే స్థానిక పోలీసులకు అప్పగిస్తారు. బాలానగర్, మాదాపూర్, శంషాబాద్ జోన్లలో అత్యధికంగా ఫిర్యాదులు అందుతున్న ఒక్కో పీఎస్ పరిధిలో ముందుగా ఈ సేవలను ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా మియాపూర్, రాజేంద్రనగర్, జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో ముందుగా ఈ ‘షీ టీమ్స్ డయల్ 100’ బృందాలను అందుబాటులోకి తేనున్నారు.

సాధారణంగా డయల్ 100కు ఫిర్యాదు రాగానే కంట్రోల్ రూం సిబ్బంది స్థానిక పోలీసులను అప్రమత్తం చేస్తారు. సుమారు 7 నిమిషాల్లో పెట్రోలింగ్ వాహనం అక్కడికి చేరుకుంటుంది. అందులోని సిబ్బంది అంతా పురుషులే కావడంతో తమ సమస్యను చెప్పుకునేందుకు మహిళలు ఇబ్బంది పడుతున్నారని, . దీంతో వారికి పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదన్న విషయం ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన సీపీ సజ్జనార్ ఈ అంశంపై మరింత కసరత్తు చేయాలంటూ డీసీపీ(షీ టీమ్స్) అనసూయకు సూచించారు. ఆమె క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ‘షీ టీమ్స్ డయల్ 100’కు రూపకల్పన చేసినట్లు సమాచారం.