ఐఐఎమ్‌లో సీటు రాలేదని.. 

ప్రముఖ యూనివర్శటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన ఓ వ్యక్తి, నోయిడాలో నివాసం ఉంటూ మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఎమ్‌బీఏ చేస్తే బాగుండు అని అతడికి అనిపించింది. రెండు సార్లు తీవ్రంగా ప్రయత్నించినా ఐఐఎమ్‌లో

  • Tv9 Telugu
  • Publish Date - 1:07 pm, Wed, 22 July 20
ఐఐఎమ్‌లో సీటు రాలేదని.. 

ప్రముఖ యూనివర్శటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన ఓ వ్యక్తి, నోయిడాలో నివాసం ఉంటూ మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఎమ్‌బీఏ చేస్తే బాగుండు అని అతడికి అనిపించింది. రెండు సార్లు తీవ్రంగా ప్రయత్నించినా ఐఐఎమ్‌లో సీటు సంపాదించలేక పోయాడు. కల చెదిరింది. దీంతో అతడో టీనేజర్లా తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యాడు. లోకానుభవం, ఉద్యోగానుభవం ఉన్నప్పటికీ అతడు పరిస్థితులతో రాజీ పడలేకపోయాడు. ఆత్మహత్యే శరణ్యమనుకున్నాడు. ముందుగా తల్లిదండ్రులను తప్పుదారి పట్టించేందుకు తనను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పి జైపూర్ వెళ్లే రైలెక్కేశాడు.

ఆ వ్యక్తి నెంబర్ నుంచి రూ. 5 లక్షలు ఇస్తేనే కుమారుడిని విడిచిపెడతాం అనే మెసేజ్ జులై 19న తండ్రికి అందింది. అయితే.. అతడికి రెండో ఫోన్ ఉందని తల్లిదండ్రులకు తెలీదు. దీంతో తండ్రి వెంటనే పోలీసులను సంప్రదించారు. సీసీటీవీ ఆధారంగా పోలీసులు యువకుడి లొకేషన్‌ను తెలుసుకున్నారు. జైపూర్ వెళ్లే రైలెక్కినట్టు వారికి అర్థమైంది. వెంటనే వారు రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో వారు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చిన మీదట తల్లిదండ్రులకు అప్పగించారు.