ఇక ప్రతిరోజూ నల్లా నీళ్లు..కరీంనగర్ రికార్డు!
రాష్ట్రమంతా ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ప్రతిరోజూ మంచినీటి సరఫరా కార్యక్రమం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది.
రాష్ట్రమంతా ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ప్రతిరోజూ మంచినీటి సరఫరా కార్యక్రమం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. కరీంనగర్ కార్పొరేషన్‌లో ప్రతి రోజూ శుద్ధమైన నీటి సరఫరా కోసం శాతవాహన వర్సిటీలో రూ. 109 కోట్లతో ఏర్పాటు చేసిన మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..
30 ఏళ్ల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టినట్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతో పూర్తిచేసిన నేపథ్యంలో ఈ పథకానికి ‘కేసీఆర్ జలం.. ఇంటింటికీ వరం’ అని నామకరణం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో ప్రతిరోజూ మంచినీటి సరఫరా చేసే తొలి నగరపాలక సంస్థగా కరీంనగర్ రికార్డును సొంతం చేసుకుందని చెప్పారు. ముందు ముందు 24/7 నీటి సఫరా చేసేందుకు సమాయత్తమవుతోందని తెలిపారు.
ఇక రాష్ట్రమంత ఈ ‘కేసీఆర్ జలం.. ఇంటింటికీ వరం’ పథకం ఆదర్శం కావాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ సాగు, తాగు నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి రూ. 1కే నల్లా కనెక్షన్ ఇస్తామని తెలిపారు.