గుడ్ న్యూస్.. నిమ్స్‌ క్లినికల్ ట్రయిల్స్.. తొలి విజయం..

Covaxin Trail In Nims Hyderabad: హైదరాబాద్ నిమ్స్‌లో నిర్వహిస్తున్న తొలిదశ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయిల్స్ ఆశాజనక ఫలితాలను ఇస్తున్నాయి. భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కొవాక్జిన్ వ్యాక్సిన్‌ను సోమవారం ఇద్దరు వాలంటీర్లకు ఇవ్వగా.. వారి ఆరోగ్యం నిపరిస్థితి నిలకడగా ఉండటంతో మంగళవారం ఇరువురిని డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. ఈ ఇద్దరి వాలంటీర్ల ఆరోగ్యాన్ని 14 రోజుల పాటు పర్యవేక్షించి.. వారి రక్త నమూనాలను కూడా పరీక్షించిన తర్వాత రెండో డోస్ ఇస్తామని కొవాక్జిన్‌ […]

గుడ్ న్యూస్.. నిమ్స్‌ క్లినికల్ ట్రయిల్స్.. తొలి విజయం..
Follow us

|

Updated on: Jul 22, 2020 | 12:52 PM

Covaxin Trail In Nims Hyderabad: హైదరాబాద్ నిమ్స్‌లో నిర్వహిస్తున్న తొలిదశ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయిల్స్ ఆశాజనక ఫలితాలను ఇస్తున్నాయి. భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కొవాక్జిన్ వ్యాక్సిన్‌ను సోమవారం ఇద్దరు వాలంటీర్లకు ఇవ్వగా.. వారి ఆరోగ్యం నిపరిస్థితి నిలకడగా ఉండటంతో మంగళవారం ఇరువురిని డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు.

ఈ ఇద్దరి వాలంటీర్ల ఆరోగ్యాన్ని 14 రోజుల పాటు పర్యవేక్షించి.. వారి రక్త నమూనాలను కూడా పరీక్షించిన తర్వాత రెండో డోస్ ఇస్తామని కొవాక్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్ డాక్టర్‌ సి. ప్రభాకర్‌రెడ్డి వెల్లడించారు. ఈ టీకా తీసుకున్నవారిలో అలర్జీ, ఇతర ఆరోగ్య సమస్యలు ఏవి లేవని ఆయన అన్నారు. కొవాక్జిన్‌ టీకా క్లినికల్ ట్రయిల్‌లో మొదటి ప్రయత్నం విజయవంతమైందని తెలిపారు. కాగా, క్లినికల్ ట్రయిల్స్‌లో భాగంగా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు జారీ అయిన మరో ఇద్దరికీ ఇవాళ నిమ్స్ డాక్టర్లు టీకా డోస్ ఇవ్వనున్నారు. ఇక ఈ టీకా క్లినికల్ ట్రయిల్స్‌ను రెండు లేదా మూడు నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నామని ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఒకవేళ పరీక్షలు విజయవంతమైతే.. ఈ ఏడాది చివరికి లేదా వచ్చే ఏడాది మొదట్లో గానీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు.

Also Read: జగన్ సర్కార్ మరో సంచలనం.. ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ..