రాజస్తాన్..ఇది రాజ్యాంగ సంక్షోభమే…స్పీకర్ సీపీ జోషీ
రాజస్తాన్ రాజకీయ సంక్షోభంపై స్పీకర్ సీపీ జోషీ తొలిసారిగా స్పందించారు. మాజీ డిప్యూటీ సీఎం, అసమ్మతి నేత సచిన్ పైలట్ పైన, ఆయన వెంట ఉన్న 18 మంది ఎమ్మెల్యేల పైన వారి అనర్హతకు సంబంధించి ఈ నెల 24 వరకు ఎలాంటి..

రాజస్తాన్ రాజకీయ సంక్షోభంపై స్పీకర్ సీపీ జోషీ తొలిసారిగా స్పందించారు. మాజీ డిప్యూటీ సీఎం, అసమ్మతి నేత సచిన్ పైలట్ పైన, ఆయన వెంట ఉన్న 18 మంది ఎమ్మెల్యేల పైన వారి అనర్హతకు సంబంధించి ఈ నెల 24 వరకు ఎలాంటి చర్యా తీసుకోరాదంటూ రాజస్తాన్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తావించిన ఆయన.. ఇది రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందన్నారు. ఈ సంక్షోభ నివారణకు తాను సుప్రీంకోర్టుకెక్కుతానని తెలిపారు. ఈ రెబెల్ ఎమ్మెల్యేలు రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించారని జోషీ ఆరోపించారు. పార్టీ ఫిరాయింపుల నిషేధంపై స్పీకర్ మాత్రమే నిర్ణయం తీసుకోగలుగుతారని అత్యున్నత న్యాయస్థానం ఇదివరకే స్పష్టం చేసిందని ఆయన చెప్పారు. రెబెల్ సభ్యులకు నోటీసులు జారీ చేసే పూర్తి అధికారాలు స్పీకర్ కి ఉన్నాయని అన్నారు. వారు కోర్టులో వేసిన పిటిషన్ రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందని జోషీ హెచ్ఛరించారు.