SDT Bike Accident: సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్‌కు కారణాలు ఏంటి?.. పూర్తి వివరాలు
Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ స్కిడ్ కావడానికి కారణం ఏంటి? ఓవర్ స్పీడ్ కారణమా? లేక రోడ్డుపై పేరుకుపోయిన ఇసుక కారణమా? అక్కడ రోడ్డుపై ఉన్న పరిస్థితి చూస్తే ఇసుకే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
Sai Dharam Tej Accident News: సాయి ధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ స్కిడ్ కావడానికి కారణం ఏంటి? ఓవర్ స్పీడ్ కారణమా? లేక రోడ్డుపై పేరుకుపోయిన ఇసుక కారణమా? అక్కడ రోడ్డుపై ఉన్న పరిస్థితి చూస్తే ఇసుకే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన భారీ నగరంలో చాలా చోట్ల ఇసుక పేరుకుపోయింది. దీంతో స్పీడ్‌గా వెళ్లే బైక్‌లు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అతి వేగంగా వెళ్లే ట్రయంఫ్, డ్యూక్, బీఎండబ్ల్యూ బైక్‌లు ఇసుకలో స్కిడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు సాయిధరమ్‌తేజ్ బైక్ యాక్సిడెంట్ విషయంలోనూ అదే జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
రాత్రి 8 గంటల సమయంలో కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా రూట్‌లో వెళ్తున్న సమయంలో సాయిధరమ్‌తేజ్ ప్రయాణిస్తున్న బైక్ కు యాక్సిడెంట్ అయింది. బైక్ వేగంగా వెళ్లడం, కంట్రోల్ తప్పడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. అయితే హెల్మెట్ ధరించడంతో తలకు దెబ్బ తగల్లేదని పోలీసులు చెబుతున్నారు. యాక్సిడెంట్ తర్వాత హెల్మెట్ ఎగిరి దూరంలో పడింది. కుడి కన్ను, ఛాతి, పొట్ట గాయంలో గాయాలయ్యాయి.
సాయి ధరమ్ తేజ్ బైక్ స్కిడ్ కావడానికి అతి వేగమే కారణంకావచ్చని తొలుత భావించారు. స్పోర్ట్స్ బైక్ కావడం, గతంలోనూ ఈ బైక్‌పై ఓవర్ స్పీడ్ చలాన్ నమోదయ్యింది. దీంతో ఓవర్ స్పీడ్ కారణంగానే సాయి ధరమ్ బైక్ స్కిడ్ అయ్యి ఉండొచ్చని పోలీసులు కూడా భావించారు. అయితే ప్రమాద సీసీటీవీ దృశ్యాల్లో సాయి ధరమ్ మరీ అంత వేగంగా ఏమీ బైక్‌ను డ్రైవ్ చేయడం లేదని తేలింది.
రోడ్డుపై పేరుకుపోయిన ఇసుకే సాయి ధరమ్ బైక్ స్కిడ్ కావడానికి కారణంగా తెలుస్తోంది. సహజంగా స్పోర్ట్స్ బైక్స్ ఇసుకపై స్కిడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దీంతో GHMC అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న ఇసుకను శనివారం ఉదయం తొలగించారు. సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురైన ప్రాంతంలో రోడ్డు పక్కన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో వాటికి సంబంధించిన ఇసుక, మట్టి రోడ్డుపై పడడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వరకు రోడ్డుపై ఎక్కడా ఇసుక లేదు. కేవలం సాయిధరమ్‌తేజ్ బైక్ ప్రమాదం జరిగిన ప్రాంతంలో మాత్రమే ఇసుక ఉంది. దీంతో అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
రోడ్డు మీద ఇసుక వల్లే ప్రమాదం జరిగిందా..Watch Video
Also Read..
Sai Dharam Tej Accident: నేను ముందే సాయిధరమ్ తేజ్‌ను హెచ్చరించా : నటుడు నరేష్
Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తున్నారు.. ఆ 4 గంటలు ఏం జరిగింది?