Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్‌ బైక్ యాక్సిడెంట్.. రాత్రి 8 గం.ల మొదలు.. గత 14 గంటల్లో ఏం జరిగింది?

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తర్వాత ఏం జరిగింది..? పోలీసులకు సమాచారం ఎవరిచ్చారు..? మెడికవర్‌లో సాయి ధరమ్‌కి ఏ ట్రీట్‌మెంట్‌ చేశారు..?

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్‌ బైక్ యాక్సిడెంట్.. రాత్రి 8 గం.ల మొదలు.. గత 14 గంటల్లో ఏం జరిగింది?
Sai Tej Accident

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తర్వాత ఏం జరిగింది..? పోలీసులకు సమాచారం ఎవరిచ్చారు..? మెడికవర్‌లో సాయి ధరమ్‌కి ఏ ట్రీట్‌మెంట్‌ చేశారు..? దెబ్బలు బలంగా తగిలాయా…? ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది..? ఇంతకీ అపోలో వైద్యులు ఏమంటున్నారు?

హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో హీరో సాయిధరమ్ తేజ్ ప్రయాణిస్తున్న స్పోర్ట్స్‌ బైక్‌ ప్రమాదానికి గురైంది. సరిగ్గా రాత్రి 8 గం.లకు జరిగిన ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు వాహనదారులు ప్రమాద విషయాన్ని పోలీసులకు చెప్పారు. దాంతో వెంటనే స్పందించిన మాదాపూర్‌ పోలీసులు…ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఘటనా స్థలానికి వచ్చారు. నిమిషాల వ్యవధిలోనే 108 వాహనం అక్కడికి చేరుకుంది. తీవ్రగాయాలపాలైన సాయిధరమ్‌తేజ్‌ను సమీపంలోనే ఉన్న మెడికవర్‌ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వెంటనే ప్రాథమిక చికిత్స చేశారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిందని సాయిధరమ్‌తేజ్‌ అని గుర్తించిన పోలీసులు వారి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో హెల్మెట్ ఉన్నప్పటికీ సాయిధరమ్ తేజ్‌కు కుడికన్ను, ఛాతి, పొట్ట, కాలివేలి భాగంలో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే చికిత్స అందించారు వైద్యులు. కొన్ని టెస్టులు చేసి కాలర్‌ బోన్‌ విరిగినట్లు తెలిపారు. అదే సమయంలో మెడికవర్‌ ఆస్పత్రికి చేరుకున్న పవన్‌ కల్యాణ్‌ సాయిధరమ్‌ చికిత్స పై ఆరా తీశారు. ప్రాణాపాయం ఏమిలేదని వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం అపోలో ఆస్పత్రికి తరలించాలన్న సూచనతో వెంటనే అంబులెన్స్‌లో అక్కడి నుంచి షిఫ్టు చేశారు.

సాయిధరమ్‌తేజ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని..త్వరగా అతను కోలుకుంటాడని ఆశిస్తున్నట్లు మెడికవర్ ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడిన పవన్‌కళ్యాణ్‌ చెప్పారు. సాయి ధరమ్‌ తేజ్‌ బైక్‌ స్కిడ్‌ అయి కిందపడిపోయారని మాదాపూర్‌ ఏసీపీ రఘునందన్‌ తెలిపారు . ఐకియా సమీపంలో రోడ్డుపై మట్టి ఉండటంతో బైక్‌ స్కిడ్‌ అయిందన్నారు. ప్రస్తుతం సాయిధరమ్‌తేజ్‌ పరిస్థితి ఔటాఫ్‌ డేంజర్‌ అని వైద్యులు చెప్పారన్నారు.

కోలుకుంటున్న సాయి ధరమ్ తేజ్..

సాయి ధరమ్‌ తేజ్‌కి జూబ్లీహిల్స్‌ అపోలా ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. కుటుంబసభ్యులు, సినీ తారలతో పాటు మెగా అభిమానులు పెద్దసంఖ్యలో ఆస్పత్రికి వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. బైక్‌ యాక్సిడెంట్‌ కాబట్టి…ఆయన్ని 48 గంటలపాటు క్లోజ్‌గా మానిటర్‌ చేయాల్సి ఉందన్నారు. సాయి ధరమ్‌కు కాలర్ బోన్ విరిగిందనీ..అయినా కంగారు పడాల్సిన పని లేదన్నారు డాక్టర్లు. ముందు జాగ్రత్తగా వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. సాయి ధరమ్‌ కండిషన్‌ బాగానే ఉందని అల్లు అరవింద్‌ తెలిపారు. త్వరలోనే కోలుకుంటాడని.. అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ప్రధాన అవయవాలు బాగానే పనిచేస్తున్నాయని అపోలో వైద్య బృందం తెలిపింది. ప్రస్తుతానికి ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇన్‌సైడ్ బ్లీడింగ్, ఆర్గాన్ డ్యామేజ్ లేదని వైద్యులు ప్రకటించారు. సిటీ స్కాన్‌తో పాటు పలు రకాల పరీక్షలు నిర్వహించి.. తేజ్.. తల, వెన్నుముకలకు తీవ్ర గాయాలేవీ కాలేదన్నారు వైద్యులు.

డాక్టర్లు ఇచ్చిన రిపోర్టును బట్టి చూస్తే.. సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నార్మల్‌గానే ఉన్నట్టు తెలిపారు సీనియర్ ఆర్ధో సర్జన్, డాక్టర్ వినోద్ కుమార్. ఘటన జరిగిన తర్వాత 24 గంటల వరకూ మనిషిని అసిస్ట్ చేయడం కామనే. ఆ వ్యక్తికి కనీసం 24 గంటలు రెస్ట్ అవసరమని చెప్తున్నారు. బాడీ ఫంక్షనింగ్ స్టడీ చేయడానికి.. స్టెబిలైజ్ చేసి ఉంచుతారని తెలిపారు వైద్యులు. క్లావికల్ ఫ్రాక్షర్ అనేది.. చాలా చిన్నదిగా చెప్తున్నారు డాక్టర్లు. కిందపడిన వారిలో చాలా మందికి ఇది కామన్‌గా తగిలే దెబ్బే అని అంటున్నారు. కానీ హెల్మెట్ లేకపోయి ఉంటే చాలా పెద్ద తగిలి ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆస్పత్రి దగ్గర క్యూకట్టిన కుటుంబ సభ్యులు..

సాయిధరమ్‌ తేజ్‌ను చూసేందుకు అపోలో ఆస్పత్రికి ఫ్యామిలీ మెంబర్స్‌ క్యూ కట్టారు. చిరంజీవి దంపతులు, రాంచరణ్, ఉపాసన తదితరులు అపోలో హాస్పిటల్‌కి చేరుకుని.. సాయిధరమ్ తేజ్‌ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను ఆరా తీశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి ధరమ్‌ తేజ్‌ను అటు పలువురు సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, సినీ నటి రాశీఖన్నా అపోలో ఆస్పత్రికి వచ్చారు. సాయిధరమ్‌ను చూసి అతని ఆరోగ్య పరిస్థితి గురించి తేజ్ కుటుంబసభ్యులనడిగి తెలుసుకున్నారు.

మరోవైపు ఈ బైక్ ను రైడ్ చేసినందుకుగానూ సాయి ధరం తేజ్ పై ఐపీసీ 336, 184 ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు. నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్ కింద కేసులు పెట్టారు. ప్రయాణానికి ముందు తేజ్ తీసుకున్న ఫుడ్ ఏంటీ.. ఆ సమయంలో ఏమైనా ఒత్తిడికి గురయ్యారా.. లేక ఇంకేమైనా కారణలు ఉన్నాయా అనే కోణంలో పోలీసు దర్యాప్తు జరుగుతోంది.

Also Read..

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ తాజా హెల్త్ బులిటెన్‌లో అసలు డాక్టర్లు ఏం చెప్పారు.. పూర్తి వివరాలు మీ కోసం

SDT Bike Accident: సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్‌కు కారణాలు ఏంటి?.. పూర్తి వివరాలు

 

Click on your DTH Provider to Add TV9 Telugu