Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ తాజా హెల్త్ బులిటెన్‌లో అసలు డాక్టర్లు ఏం చెప్పారు.. పూర్తి వివరాలు మీ కోసం

రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కాబట్టి మరో మరికొన్ని గంటల పాటు సాయి ధరమ్ తేజ్‌ను అబ్జర్వేషన్‌లో ఉంచుతామని అన్నారు వైద్యులు. తేజ్‌కు కుడికన్ను, ఛాతి, పొట్ట, కాలివేలి భాగంలో తీవ్రగాయాలయ్యాయి.

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ తాజా హెల్త్ బులిటెన్‌లో అసలు డాక్టర్లు ఏం చెప్పారు.. పూర్తి వివరాలు మీ కోసం
Sai Tej Health Report
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 11, 2021 | 12:58 PM

రాత్రి 8. గంటలు.. రోడ్ నెం. 45.. కేబుల్ బ్రిడ్జ్- ఐకియా మధ్య ప్రాంతం.. రయ్యి రయ్యిన ఓ కాస్ట్‌‍లీ బైక్ దూసుకొచ్చింది. స్కిడ్ అయి కింద పడింది. సీన్ కట్ చేస్తే హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు మీద పడిఉన్నాడు. ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటి? దెబ్బల తీవ్రత ఏస్థాయిలో ఉందో ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాం. సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదమేమీ లేదని వైద్యులు చెప్తున్నారు. కాలర్ బోన్ విరిగిందనీ.. అయినా కంగారు పడాల్సిన పని లేదని అన్నారు. ముందు జాగ్రత్తగా తాము ఐసీయూకు తరలించామనీ.. వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు చెప్తున్నారు. తేజ్.. తల, వెన్నుముకలకు తీవ్ర గాయాలేవీ కాలేదనీ.. వచ్చే 24 గంటల్లో మళ్లీ పరీక్షలు చేస్తామని అన్నారు అపోలో డాక్టర్లు. రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కాబట్టి మరో మరికొన్ని గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతామని అన్నారు వైద్యులు. తేజ్‌కు కుడికన్ను, ఛాతి, పొట్ట, కాలివేలి భాగంలో తీవ్రగాయాలయ్యాయి. కొన్ని టెస్టులు చేసి కాలర్‌బోన్‌ విరిగినట్లు తెలిపారు.

తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ప్రధాన అవయవాలు బాగానే పనిచేస్తున్నాయని అపోలో వైద్య బృందం తెలిపింది. ప్రస్తుతానికి ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇన్‌సైడ్ బ్లీడింగ్, ఆర్గాన్ డ్యామేజ్ లేదని వైద్యులు ప్రకటించారు. సిటీ స్కాన్‌తో పాటు పలు రకాల పరీక్షలు నిర్వహించి.. తేజ్.. తల, వెన్నుముకలకు తీవ్ర గాయాలేవీ కాలేదన్నారు వైద్యులు. డాక్టర్లు ఇచ్చిన రిపోర్టును బట్టి చూస్తే.. సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నార్మల్‌గానే ఉన్నట్టు తెలిపారు సీనియర్ ఆర్ధో సర్జన్, డాక్టర్ వినోద్ కుమార్. ఘటన జరిగిన తర్వాత 24 గంటల వరకూ మనిషిని అసిస్ట్ చేయడం కామనే. ఆ వ్యక్తికి కనీసం 24 గంటలు రెస్ట్ అవసరమని చెప్తున్నారు. బాడీ ఫంక్షనింగ్ స్టడీ చేయడానికి.. స్టెబిలైజ్ చేసి ఉంచుతారని తెలిపారు వైద్యులు. క్లావికల్ ఫ్రాక్షర్ అనేది.. చాలా చిన్నదిగా చెప్తున్నారు డాక్టర్లు. కిందపడిన వారిలో చాలా మందికి ఇది కామన్‌గా తగిలే దెబ్బే అని అంటున్నారు. కానీ హెల్మెట్ లేకపోయి ఉంటే చాలా పెద్ద దెబ్బలు తగిలి ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు ఈ బైక్ ను రైడ్ చేసినందుకుగానూ సాయి ధరం తేజ్ పై ఐపీసీ 336, 184 ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు. నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్ కింద కేసులు పెట్టారు. ప్రయాణానికి ముందు తేజ్ తీసుకున్న ఫుడ్ ఏంటీ.. ఆ సమయంలో ఏమైనా ఒత్తిడికి గురయ్యారా.. లేక ఇంకేమైనా కారణలు ఉన్నాయా అనే కోణంలో పోలీసు దర్యాప్తు జరుగుతోంది.

Also Read: సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్‌కు కారణాలు ఏంటి?.. పూర్తి వివరాలు

Sai Dharam Tej Accident: ఇంత మంచి మనిషికి ఏం కాదు.. త్వరలోనే ఫిట్‌గా ఇంటికి వస్తారు