Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ ఎంత మంచివాడో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రాణాపాయం లేదని చికిత్సకు స్పందిస్తున్నాడని డాక్టర్లు తెలిపారు. అభిమానులెవ్వరూ ఆందోళన చెందవద్దని చిరంజీవి కూడా ట్వీట్ చేశారు.

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ ఎంత మంచివాడో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం
Sai Dharam Tej
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 11, 2021 | 1:00 PM

శుక్రవారం రాత్రి ప్రమాదానికి గురైన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నారు. ఆయనకు డాక్టర్లు మెరుగైన వైద్యం అందిస్తున్నారు.  అతడికి ప్రాణాపాయం ఏం లేదని చెప్పారు. కాగా సాయి తేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. వారి కోరుకున్న విధంగానే అతడు క్షేమంగా పూర్తి ఆరోగ్యంగా ఇంటికి వస్తారు. ఎందుకంటే సాయి ధరమ్ తేజ్ మంచి మనిషి. అతడికి చీమకు హాని చేయని గుణం ఉంది. అతడు రీల్ హీరో మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా. తన కళ్ల ముందు ఎవరైనా బాధ పడుతూ కనిపిస్తే విలవిల్లాడిపోతాడు. అహం కానీ, యాటిట్యూడ్ కానీ అతని వద్ద కనిపించవు. పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి అనే గర్వం అస్సలు ఉండదు. తన కంటే పెద్ద వాళ్లు అయితే చిన్న, చిన్న నటులను కూడా ‘అన్న’ అనే సంభోదిస్తాడు. ఎవరైనా సాయం కావాలని అడిగితే వెంటనే రెస్పాండ్ అవుతాడు. ఈ విషయాలు మేము చెబుతున్నవి కావు. సినిమా ఇండస్ట్రీలోని జనాలు, అతని సన్నిహితులు చెబుతున్న మాటలు. సాయి తేజ్ మంచితనం గురించి ఇప్పుడు మీకు ఓ ఉదాహారణ చెప్పబోతున్నాం.

2019, ఇదే సెప్టెంబర్ నెలలో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 52 లో బైక్‌పై స్పీడ్‌ గా వెళ్తున్న వ్యక్తి.. ప్రమాదానికి గురయ్యాడు. ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అక్కడికి వచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్‌.. ఆ వ్యక్తికి సాయం చేసేందుకు కారు దిగి వచ్చాడు. దగ్గరకు వెళ్లి యాక్సిడెంట్‌కు గురైన వ్యక్తిని చూసి సాయి తేజ్ షాక్‌కు గురయ్యాడు. గాయపడ్డ వ్యక్తి ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే మ్యూజిక్ డైరెక్టర్ అచ్చుగా గుర్తించాడు. దీంతో తానే స్వయంగా అచ్చుని ఎత్తుకుని సాయి ధరమ్‌ తేజ్‌ కారులో ఎక్కించాడు. అక్కడి నుంచి అతడిని తన కారులోనే ఆస్పత్రికి తరలించి.. అతడు రికవర్ అయ్యేవరకు జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇది మాత్రమే కాదు… చిన్న, చిన్న ఆర్టిస్టులకు తన సినిమాల్లో అవకాశాలు ఇప్పించడం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి తన శక్తి మేరకు సాయి తేజ్ సాయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చాలామంది చెబుతున్నారు. అంత మంచి మనిషికి ఏం కాదు. కొద్ది రోజుల్లోనే ఫిట్‌గా, పర్‌ఫెక్ట్‌గా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి తిరిగివస్తాడు. GET WELL SOON SAI DHARAM TEJ 

Also Read: టాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్‌గా దూసుకుపోతున్న ఈ నటి ఎవరో గుర్తు పట్టగలరా?

మెగా హీరోకు యాక్సిడెంట్ అవ్వడానికి ఆ ప్రాంతంలో ఇసుకే కారణమా..? లేటెస్ట్ అప్‌డేట్