AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Dharam Tej Accident: ప్రమాదానికి కొన్ని క్షణలముందు కేబుల్ బ్రిడ్జ్ పై సాయి ధరమ్ తేజ్.. CCTV దృశ్యాలు

యంగ్ హీరో.. మెగా మేనల్లుడు రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తేజ్ ప్రయాణిస్తున్న స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అవ్వడంతో ఒక్కసారిగా అతడు కింద పడిపోయాడు

Sai Dharam Tej Accident: ప్రమాదానికి కొన్ని క్షణలముందు కేబుల్ బ్రిడ్జ్ పై సాయి ధరమ్ తేజ్.. CCTV దృశ్యాలు
Tej
Rajeev Rayala
| Edited By: Janardhan Veluru|

Updated on: Sep 11, 2021 | 11:49 AM

Share

Sai Dharam Tej Accident: యంగ్ హీరో.. మెగా మేనల్లుడు రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తేజ్ ప్రయాణిస్తున్న స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అవ్వడంతో ఒక్కసారిగా అతడు కింద పడిపోయాడు. దాంతో తేజ్ కంటి పై భాగానికి, ఛాతికి, కాలికి గాయాలయ్యాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ రాయదుర్గం పరిధి ఐకియా స్టోర్‌ సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో సాయిధరమ్‌ తేజ్‌ గాయపడ్డాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిధరమ్ తేజ్‌పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదైంది.

ఇదిలా ఉంటే తాజాగా తేజ్ బైక్ నడుపుతున్న సీసీ రికార్డ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదానికి ఒక్క నిమిషం ముందు దుర్గం చెరువు వద్ద ఉన్న కేబుల్ బ్రిడ్జ్ పై తేజ్ తన బైక్‌తో వేగంగా వెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు. మితిమీరిన  వేగంతో బైక్ నడపడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలుపుతున్నారు. అతడు కోలుకున్న తర్వాత పోలీసులు ఈ ప్రమాదం పై విచారించనున్నారు. అయితే సమాచారం అందగానే  పోలీసులు ఘటనా స్థలం నుంచి స్పోర్ట్స్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాద సమయంలో సాయిధరమ్ తేజ్ హెల్మెట్ పెట్టుకునే ఉన్నారని మాదాపూర్ డీసీపీ తెలిపారు. అందువల్లే ప్రమాదంలో తీవ్రగాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.

సాయిధరమ్‌తేజ్‌ బైక్‌ ప్రమాదానికి గురైన ప్రాంతంలో రోడ్డు పక్కన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో వాటికి సంబంధించిన ఇసుక, మట్టి రోడ్డుపై పడడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కేబుల్‌ బ్రిడ్జి నుంచి ఐకియా వరకు రోడ్డుపై ఎక్కడా ఇసుక లేదు. కేవలం సాయిధరమ్‌తేజ్‌ బైక్‌ ప్రమాదం జరిగిన ప్రాంతంలో మాత్రమే ఇసుక ఉంది. దీంతో అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sai Dharam Tej Bike Features: సాయిధరమ్‌ బైక్‌ ప్రత్యేకతలు ఏంటి..?? వీడియో

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ చికిత్స పొందుతోన్న ఆస్పత్రికి సినీ ప్రముఖుల క్యూ.. ఎవరెవరు వచ్చారంటే..?

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదంపై బండ్ల గణేష్ ట్వీట్..

6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?