Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ చికిత్స పొందుతోన్న ఆస్పత్రికి సినీ ప్రముఖుల క్యూ.. ఎవరెవరు వచ్చారంటే..?

సైబరాబాద్‌ కమిషనరేట్‌ రాయదుర్గం పరిధి ఐకియా స్టోర్‌ సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో సాయిధరమ్‌ తేజ్‌ గాయపడ్డారు.

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ చికిత్స పొందుతోన్న ఆస్పత్రికి సినీ ప్రముఖుల క్యూ.. ఎవరెవరు వచ్చారంటే..?
Sai Dharam Tej
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 11, 2021 | 10:14 AM

సాయి ధరమ్ తేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. తేజ్‌కు కాలర్ బోన్ విరిగిందని.. అయినా కంగారు పడాల్సిన పని లేదన్నారు డాక్టర్లు. ముందు జాగ్రత్తగా వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. అపోలో హాస్పిటల్‌కి వచ్చిన రాంచరణ్, ఉపాసన… సాయిధరమ్ తేజ్‌ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను ఆరా తీశారు. సాయిధరమ్‌ తేజ్‌ను చూసేందుకు అపోలో ఆస్పత్రికి క్యూ కట్టారు ఫ్యామిలీ మెంబర్స్‌. సాయిధరమ్‌ కండిషన్‌ బాగానే ఉందని..త్వరలోనే కోలుకుంటాడని..అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు అల్లు అరవింద్‌.

అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి ధరమ్‌ తేజ్‌ను పరామర్శిస్తున్నారు పలువురు సినీ ప్రముఖులు. సినీ నటి రాశీఖన్నా, నటుడు ప్రకాశ్ రాజ్, హీరో శ్రీకాంత్ అపోలో ఆస్పత్రికి వచ్చారు. సాయిధరమ్‌ను చూసి అతని ఆరోగ్య పరిస్థితి గురించి తేజ్ కుటుంబసభ్యులనడిగి తెలుసుకున్నారు. సాయిధరమ్‌తేజ్‌ బైక్‌ స్కిడ్‌ కావడానికి రోడ్డుపై పేరుకుపోయిన ఇసుకే కారణంగా తెలుస్తోంది. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు అధికారులు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న ఇసుకను తొలగించారు.  రాత్రి 8 గంటల సమయంలో సాయిధరమ్‌తేజ్‌ బైక్‌ ప్రమాదానికి గురైందని మాదాపూర్‌ ఏసీపీ చెబుతున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామంటున్నారు. సాయిధరమ్‌తేజ్‌ ఒంటిపై రెండు మూడు చోట్ల గాయాలయ్యాయని ఏసీపీ తెలిపారు. తన మేనల్లుడు, నటుడు సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు.

శుక్రవారం రాత్రి మెడికవర్‌ ఆసుపత్రిలో సాయిధరమ్‌తేజ్‌ని పరామర్శించారు పవన్‌కల్యాణ్‌. అల్లు అరవింద్‌ కూడా సాయిధరమ్‌ తేజ్‌ని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మెరుగైన ట్రీట్‌మెంట్‌ కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.

Also Read: సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదంపై బండ్ల గణేష్ ట్వీట్..

మెగా హీరోకు యాక్సిడెంట్ అవ్వడానికి ఆ ప్రాంతంలో ఇసుకే కారణమా..? లేటెస్ట్ అప్‌డేట్

అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
ఇషా అంబానీ వద్ద రంగులు మార్చే కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!
ఇషా అంబానీ వద్ద రంగులు మార్చే కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!