Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Crime News: ప్రియుడి సహకారంతో తల్లిని హత్య చేసిన కుమార్తె.. ఆపై డ్రామా షురూ.. కానీ

పెంచిన తల్లినే కడతేర్చిందా కర్కశ కుమార్తె. ప్రియుడితో కలిసి హతమార్చింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ రాజేంద్రనగర్​లో చోటుచేసుకుంది.

Telangana Crime News: ప్రియుడి సహకారంతో తల్లిని హత్య చేసిన కుమార్తె.. ఆపై డ్రామా షురూ.. కానీ
Daughter Kills Mother
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 11, 2021 | 1:24 PM

లాలించి, ప్రేమగా పెంచిన తల్లినే అత్యంత కిరాతకంగా చంపేసింది ఓ కూతురు. పెంచిన తల్లినే ప్రియుడితో కలిసి హతమార్చింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ రాజేంద్రనగర్​లో చోటుచేసుకుంది. పెంపుడు తల్లి మేరీ క్రిస్టియన్​ను.. కుమార్తె రూమా హత్య చేసింది. ప్రియుడి సహకారంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. మృతురాలు మారిక స్కూల్​ ప్రిన్సిపల్‌గా పనిచేస్తోంది. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసి.. అనంతరం కనిపించడం లేదంటూ డ్రామా షురూ చేసింది. తల్లి కనిపించడం లేదంటూ… పోలీసులకు రూమా కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… రంగంలోకి దిగారు. ప్రవర్తన తేడాగా ఉండటంతో రూమా, ఆమె ప్రియుడిని పోలీసులు తమదైన శైలిలో ఎంక్వైరీ చేశారు. దర్యాప్తులో తామే చంపినట్లు రూమా, ఆమె ప్రియుడు అంగీకరించారు. తల్లిని చంపి.. హిమాయత్​సాగర్​ చెరువులో పడేసినట్లు విచారణలో తేలింది. ఉదయం హిమాయత్​సాగర్​ చెరువులో పోలీసులు మేరీ క్రిస్టియన్‌ డెడ్‌బాడీని గుర్తించారు. హత్య చేయడానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు పోలీసులు.

యువకుడి వేధింపులు తాళలేక… 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

ఖమ్మం గ్రామీణ మండలం వెంకటగిరిలో విషాదం చోటు చేసుకుంది. యువకుడి వేధింపులతో టెన్త్ క్లాస్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. సాయి అనే యువకుడు ఇంటి ముందు ఉండే విద్యార్థినిని తరచూ ప్రేమ పేరుతో వేధిస్తుండే వాడు. బాలిక తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది. వారు మందలించినా అతనిలో మార్పు రాలేదు. ఈ నెల 9వ తేదీన స్కూల్‌కి వెళ్లి వస్తున్న ఆమెను మళ్లీ యువకుడు వేధింపులకు గురిచేశాడు. ప్రేమించమంటూ వేధించాడు. సాయి వేధింపులు తాళలేక విద్యార్థిని ఇంట్లోకి వెళ్లి పురుగులమందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు బాలికను ఖమ్మం హాస్పిటల్‌లో చేర్పించారు. పరిస్థితి విషమం కావడంతో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. యువకుడిపై ఖమ్మం గ్రామీణ పీఎస్‌లో విద్యార్థిని బంధువులు కంప్లైంట్ చేశారు. యువకుడు సాయిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: టాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్‌గా దూసుకుపోతున్న ఈ నటి ఎవరో గుర్తు పట్టగలరా?

Sai Dharam Tej Accident: ఇంత మంచి మనిషికి ఏం కాదు.. త్వరలోనే ఫిట్‌గా ఇంటికి వస్తారు

మనసు మార్చుకున్న జక్కన్న.. మహేష్ మూవీ ఆలా రావటం లేదా.?
మనసు మార్చుకున్న జక్కన్న.. మహేష్ మూవీ ఆలా రావటం లేదా.?
225 మంది ప్రయాణికులతో గాల్లో విమానం. మరికొద్దిక్షణాల్లో పేలుతుంది
225 మంది ప్రయాణికులతో గాల్లో విమానం. మరికొద్దిక్షణాల్లో పేలుతుంది
రైలు మధ్యలో AC కోచ్‌లను ఎందుకు ఏర్పాటు చేస్తారు? కారణం ఇదే!
రైలు మధ్యలో AC కోచ్‌లను ఎందుకు ఏర్పాటు చేస్తారు? కారణం ఇదే!
సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌కు వెల్లువెత్తుతున్న విషెస్..
సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌కు వెల్లువెత్తుతున్న విషెస్..
ఆ ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి అమ్మవారి ముందు ప్రతిరోజు విచిత్ర ఘటన
ఆ ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి అమ్మవారి ముందు ప్రతిరోజు విచిత్ర ఘటన
హజ్ యాత్ర వేళ భారత్ సహా 14 దేశాలకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా..
హజ్ యాత్ర వేళ భారత్ సహా 14 దేశాలకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా..
కోహ్లీ, బుమ్రా మధ్య ఫన్నీ రన్‌ఔట్ డ్రామా వైరల్!
కోహ్లీ, బుమ్రా మధ్య ఫన్నీ రన్‌ఔట్ డ్రామా వైరల్!
నిందితురాలు ముస్కాన్‌ రస్తోగి గర్భం దాల్చినట్లు నిర్ధారణ
నిందితురాలు ముస్కాన్‌ రస్తోగి గర్భం దాల్చినట్లు నిర్ధారణ
ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు భారీ ప్రమాదం..!రెండు ముక్కలుగా విడిపోయి
ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు భారీ ప్రమాదం..!రెండు ముక్కలుగా విడిపోయి
నా బట్టలు నా ఇష్టం.. నేను ఇలానే ఉంటాను.
నా బట్టలు నా ఇష్టం.. నేను ఇలానే ఉంటాను.