Road Accident: కాన్పూర్‌లో ఘోర ప్రమాదం.. అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. 25 మంది మృతి..

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా ఘతంపూర్‌లో శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. భక్తులతో నిండిన ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి చెరువులో బోల్తా పడింది.

Road Accident: కాన్పూర్‌లో ఘోర ప్రమాదం.. అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్..  25 మంది మృతి..
Kanpur Road Accident
Follow us
Venkata Chari

|

Updated on: Oct 01, 2022 | 11:16 PM

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా ఘతంపూర్‌లో శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. భక్తులతో నిండిన ట్రాక్టర్ ట్రాలీ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది భక్తులు మరణించగా, 20 మందికి పైగా భక్తులు గాయపడినట్లు సమాచారం. కాగా, ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మరణించిన వారిలో 11 మంది చిన్నారులు ఉన్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసు సిబ్బందితో అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక ప్రజలతో కలిసి పోలీసు బృందం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది. క్షతగాత్రులను చెరువులో నుంచి బయటకు తీసి సమీపంలోని సీహెచ్‌సీలో జాయిన్ చేస్తున్నారు.

ట్రాక్టర్ ట్రాలీలో 40 మందికి పైగా భక్తులు ఉన్నట్లు సమాచారం. వీరంతా ఫతేపూర్ జిల్లాలోని చంద్రికా దేవి ఆలయాన్ని సందర్శించి తమ గ్రామమైన కోర్తాకు తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఘతంపూర్‌లోని సాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంభీర్‌పూర్ గ్రామ సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న చెరువులో అదుపుతప్పి బోల్తా పడింది. ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తా పడడంతో ఒక్కసారిగా కేకలు వినిపించాయి. కేకలు విని చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు.

సహాయక చర్యల్లో నిమగ్నమైన పోలీసులు..

దీంతో ప్రజలు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు-అడ్మినిస్ట్రేషన్ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతోపాటు పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. క్షతగాత్రులను సమీపంలోని సీహెచ్‌సీలో చేర్పిస్తున్నారు. అదే సమయంలో ప్రమాదంలో ఇప్పటివరకు 25 మృతదేహాలను వెలికి తీశారు.

బాధాకరమంటూ పీఎం నరేంద్ర మోదీ ట్వీట్..

ఈ దుర్ఘటనపై పీఎం నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. ‘‘ కాన్పూర్‌ రోడ్డు ప్రమాద ఘటన బాధాకరం. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిపైనే నా ఆలోచనల్నీ ఉన్నాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అంటూ పేర్కొన్నారు. ఈమేరకు ప్రధానమంత్రి మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన సీఎం యోగి..

అదే సమయంలో ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన ట్వీట్ చేస్తూ, “కాన్పూర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం చాలా హృదయ విదారకంగా ఉంది. జిల్లా మేజిస్ట్రేట్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు సరైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ